ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న దాసరి జయంతిని డైరెక్టర్స్ డేగా ప్రకటించారు. 150కి పైగా చిత్రాలను దర్శకత్వం చేయడం ఆయనకు తప్ప మరోకరికి సాధ్యం కాదేమో. అలా ఆయన గిన్నిస్‌బుక్‌లో కూడా తన పేరును లిఖించుకున్నాడు. ఇక దాసరి విగ్రహాన్ని తాజాగా ఫిలించాంబర్‌లో ఏర్పాటు చేశారు. ఇక కొంతకాలంగా కాస్టింగ్‌కౌచ్ వల్ల శ్రీరెడ్ది వ్యాఖ్యల వల్ల టాలీవుడ్ పరిశ్రమ పరువును పోగొట్టుకుంది. ఇక ఈయన జయంతి వేడుకల కోసం విగ్రహావిష్కరణ కోసం సురేష్‌బాబుతో సహా పలువురు పాల్గొన్నారు. గత కొంతకాలం సురేష్‌బాబు.. శ్రీరెడ్డి తన చిన్నకుమారుడు అభిరామ్ ఫొటోలు విడుదల చేసినా మౌనంగా ఉన్నాడు. చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుందని ఆయన సన్నిహితులతో అన్నాడట.
ఇక దాసరి విషయానికి వస్తే ఆయన 100వ చిత్రం చిరంజీవి నటించిన 'లంకేశ్వరుడు'. 150వ చిత్రం బాలకృష్ణ నటించిన 'పరమవీరచక్ర'. ఈ రెండు డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఇక దాసరి గురించి పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ.. దాసరి జయంతిని డైరెక్టర్స్ డేగా పెట్టడం చాలా సంతోషించాల్సిన విషయం. దాసరి దర్శకుల స్థాయిని ఎంతగానో పెంచారు. నటునిగా, నిర్మాతగా, దర్శకునిగా, రచయితగా, సినీ పెద్దగా ఆయన అనితరసాధ్యమైన పని చేశారు. ఇలా దాసరికి గౌరవం ఇచ్చిన దర్శకుల మండలికి, దానికి అధ్యక్షుడైన శంకర్‌కి అభినందనలు. ఇక సినిమా ఇండస్ట్రీ అనేది ఓ కుటుంబమని, మన సమస్యలను మనమే చర్చించి, పరిష్కరించుకోవాలనేది దాసరి భావన అని తెలిపాడు.ఇక దాసరి చివరిరోజుల్లో ఆయన పవన్‌తో ఒక చిత్రం చేయాలని కలలు కన్నాడు. కానీ పవన్ మాత్రం వాయిదాల మీద వాయిదాలు వేస్తుండే సరికి పవన్‌తో సినిమా చేయాలనే చివరి కోరికను దాసరి తీర్చుకోలేకపోయాడు!