Advertisementt

ప్రభాస్ ప్రేమకి బాలీవుడ్ విలన్ పడిపోయాడు!

Sun 06th May 2018 12:20 PM
neil nitin mukesh,prabhas,national darling  ప్రభాస్ ప్రేమకి బాలీవుడ్ విలన్ పడిపోయాడు!
Neil Nitin Mukesh raves about Prabhas ప్రభాస్ ప్రేమకి బాలీవుడ్ విలన్ పడిపోయాడు!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ ఇండస్ట్రీలో డార్లింగ్ అని అందరు ముద్దుగా పిలుచుకునే హీరో ప్రభాస్. ఎందుకంటే ప్రభాస్ చాలా జెన్యూన్ పర్సన్ అని.. అందరితో సరదాగా ఉంటాడని చాలా మంది హీరోస్.. డైరెక్టర్స్ చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయ్. 'బాహుబలి' సినిమాతో నేషనల్ వైడ్ పాపులర్ అయిన ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' సినిమా షూటింగుతో బిజీగా వున్నాడు.

ఈ సినిమాకు సంబంధించి భారీ యాక్షన్ సీన్స్ ను అబుదాబిలో ప్రభాస్ .. విలన్ నీల్ నితిన్ ముఖేశ్ తదితరులపై చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ గురించి నీల్ నితిన్ ముఖేశ్ స్పందించాడు. 'నా దృష్టిలో ప్రభాస్ నేషనల్ డార్లింగ్ అని.. అయన అందరితో ఎంతో ప్రేమగా ఆత్మీయంగా మాట్లాడతారని.. ప్రతి ఒక్కరినీ వెంటనే తన ప్రేమలో పడేసేలా చేస్తుకుంటాడని చెప్పారు'.

'రీసెంట్ గా అయన నా ఫ్యామిలీ మెంబెర్స్ తో ఆయన చనువుగా గడిపిన తీరు మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది'అంటూ తాను తన భార్య.. ప్రభాస్ తో దిగిన ఫోటోలను షేర్ చేశాడు. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు..తమిళ్.. హిందీ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు యూవీ క్రియేషన్స్ వారు.

Neil Nitin Mukesh raves about Prabhas:

>Prabhas Is Nations Darling, says Neil Nitin Mukesh

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ