Advertisementt

ఆయన ఊరకే సూపర్ స్టార్ అవ్వలా..!!

Sun 06th May 2018 12:15 PM
rajinikanth,karthik subbaraj,remuneration,super star  ఆయన ఊరకే సూపర్ స్టార్ అవ్వలా..!!
RajiniKanth Shocking Remuneration For Karthik Subbaraj's film ఆయన ఊరకే సూపర్ స్టార్ అవ్వలా..!!
Advertisement
Ads by CJ

సౌత్ లో ఏ హీరోకి లేనంత పాపులారిటీ.. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సూపర్ స్టార్ రజినీకాంత్ కి. రజినీకాంత్ నుండి సినిమా వస్తుంది అంటే ఆయన ఈ సినిమాలో ఎలాంటి స్టయిల్ చూపిస్తాడో అంటూ ఆసక్తి చూపుతారు. గతంలో భాష, ముత్తు, నరసింహ ఇలా అనేక సినిమాలు రజినీకాంత్ స్టయిల్ ని ఎంతగానో చూపించాయి. ఇప్పటికి టెలివిజన్ లో ఆయా సినిమాలకున్న క్రేజ్ ని తెలియజేస్తాయి. అయితే ప్రస్తుతం రజినీకాంత్ నటించిన రెండు సినిమాలు పోస్ట్ పోన్ మీద పోస్ట్ పొన్ అవుతున్నాయి. రజిని, శంకర్ ల 2.0 ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు. అలాగే రజిని కాలా మాత్రం జూన్ 7 న విడుదలవుతుంది అంటున్నారు.

ప్రస్తుతం రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడానికి అనుకూల పరిస్థితుల కోసం ఎదురు చూడ్డంతో పాటుగా మరో కొత్త సినిమాని కూడా స్టార్ట్ చెయ్యబోతున్నాడు. పిజ్జా, జిగర్తాండ, ఇరైవి హిట్ చిత్రాల దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చెయ్యబోతున్నాడు. అయితే రజినీకాంత్ ఈ సినిమా కోసం అత్యధిక పారితోషకం తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా కోసం రజినీకాంత్ కేవలం 40 రోజుల కోసం 60 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇంతకుముందు రజినీకాంత్ ఒక్కో సినిమా కోసం 30 నుండి 40 కోట్ల పారితోషకం తీసుకుంటున్నాడని ప్రచారం ఉంది. అయినా ఇప్పుడు కేవలం 40  రోజులకే 60 కోట్లు అంటే అది రికార్డు పారితోషకమే. కోలీవుడ్ మీడియాలో రజినీ హైయ్యెస్ట్ పారితోషకం అందుకుంటున్నట్టుగా కథనాలు కథనాలు వెలువడుతున్నాయి. మరి ఇది నిజమా... కాదా అనేది మాత్రం పక్కన పెడితే.. ఈ డిస్కర్షన్ మాత్రం సూపర్ స్టార్ స్టామినా మరెవ్వరికీ ఉండదని ప్రూవ్ చేసినట్లే.

RajiniKanth Shocking Remuneration For Karthik Subbaraj's film:

Rajinikanth's unimaginable salary for Karthik Subbaraj's film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ