'బాహుబలి' ముందు వరకు ప్రభాస్, అనుష్క వంటి వారు కేవలం కొన్నిభాషల వారికే తెలుసు. కానీ 'బాహుబలి' పుణ్యమా అని అనుష్క దేశవ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకుంది. ఇక 'బాహుబలి-దికన్‌క్లూజన్' తర్వాత ఆమె నటించిన 'భాగమతి' కూడా మంచి హిట్ అయింది.ఇక అనుష్కకి దైవభక్తి ఎక్కువ. తను పలు దేవాలయాలు సందర్శిస్తుంటానని, కానీ నా సన్నిహితుల కోరికలు నెరవేరాలని తప్పితే తన కోసం అంటూ దేవుడిని ఏమీ కోరుకోనని తెలిపింది.
ఇక ఇప్పుడు అనుష్క గౌతమ్‌మీనన్ చిత్రంలో చేసేందుకు ఒప్పుకుంది. మరో చిత్రాన్ని తెలుగులో ఓకే చేయనుందని వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా ఆమెకి కాస్త సమయం దొరకడంతో ఆమె తనకిష్టమైన కేధార్‌నాథ్, బద్రినాథ్,గంగోత్రి వంటి పుణ్యస్థలాల దర్శనం కోసం ఓ సాధారణ యువతిలాగా వెళ్లింది. ఇక కేథార్‌నాథ్ ఆలయం వెళ్లిన సమయంలో ఈమె తన సింప్లిసిటీ చూపిస్తూ సాధారణ యువతిగా కనిపించినా కూడా అక్కడకు వచ్చిన పలువురు భక్తులు మాత్రం బాహుబలి దేవసేన జై అంటూ ఆ కొండల్లో మోతమోగించారు.
తనను కలుసుకోవడానికి వచ్చిన అందరినీ ఆమె ఏమాత్రం నిరుత్సాహపరచకుండా ఆమె వారితో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇక ఈమె గుడికివెళ్లి పూజలు చేసేది ఆమె పెళ్లికి సంబంధించిన విషయం కోసమే మొక్కుకోవడానికి వచ్చిందని కొందరు అంటుంటే, తనకు తనకోసం దేవుడిని ఎప్పుడు ఏ కోరిక కోరుకోనని చెప్పే అనుష్క మరి ఎవరి కోసం దేవుడికి రికమండేషన్ అందించిందో చూడాల్సివుంది! అయినా నిత్యం బిజీతో యాక్టింగ్, ఫిట్నెస్, జిమ్‌వర్కౌట్స్, యోగా, నటన వంటి వాటికి దూరంగా కాస్త రిలాక్స్‌కోసం ఆమె వెళ్లిఉంటుందనే చెప్పాలి..!