నేటితరానికి నాగబాబు.. చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌లకు సోదరుడిగా, మెగాబ్రదర్‌గానే తెలుసు. కానీ ఆయన 30 ఏళ్లకిందటే నిర్మాతగా మారి తన తల్లిపేరు మీద 'అంజనా ప్రొడక్షన్స్' బేనర్‌ని స్థాపించి, తన అన్నయ్య మెగాస్టార్‌చిరంజీవితో 'రుద్రవీణ, త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు' వంటి చిత్రాలు తీశాడు. ఇందులో 'రుద్రవీణ' కమర్షియల్‌గా హిట్‌కాకపోయినా ఆయనకు అవార్డులను తెచ్చిపెట్టింది. మిగిలిన చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. తర్వాత తన తమ్ముడు పవన్‌కళ్యాన్‌తో 'గుడుంబా శంకర్' తీస్తే అది కూడా ఫ్లాప్ అయింది. ఈయన నిర్మాతగా హిట్టయి పదిరూపాయలు సంపాదించిన చిత్రం మాత్రం 'బావగారూ బాగున్నారా' చిత్రం మాత్రమే.
ఇక 'మగధీర' తర్వాత రామ్‌చరణ్‌తో 'ఆరెంజ్' తీసి పూర్తిగా ఆర్ధికంగా నష్టపోయాడు. ఇక ఈయన ఎన్నో చిత్రాలు, టీవీ సీరియల్స్‌లో కూడా నటించాడు. ఆయన సోలో హీరోగా దాదాపు 10దాకా చిత్రాలు వచ్చాయి. ఈవీవీ తీసిన '420' చిత్రం ఆడకపోయినా కూడా ఆయనకు మంచిపేరు తెచ్చిపెట్టింది. ఇక 'ఆరెంజ్' తర్వాత మరో సినిమా నిర్మించనని చెప్పినాయన తన మేనల్లుడు అల్లుఅర్జున్ హీరోగా నటిస్తున్న 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' చిత్రానికి నిర్మాణ భాగస్వామి, సమర్పకునిగా లడగపాటి శ్రీధర్, బన్నీ వాసులతో నిర్మిస్తున్నాడు.
ఇక ఈయన తాజాగా ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ.. కొడుకుతో కాకుండా బన్నీతో చిత్రం చేయడానికి కారణం ఉంది. ఆయనతో ఇప్పటివరకు చిత్రం చేయలేదు. ఇక కుమారుడు వరుణ్‌తేజ్ వరుసగా రెండు హిట్స్ కొట్టాడు. వాడి కోసం బయటి నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు. వారికి చాన్స్‌లు ఇవ్వడమే ముఖ్యంగానీ నేను వెంటనే వాడితో సినిమా తీసి హిట్‌కొట్టి క్యాష్ చేసుకోవాలన్న ఉద్దేశ్యం నాకు లేదు. భవిష్యత్తులో వాడితో చిత్రాన్ని నిర్మిస్తానని చెప్పుకొచ్చాడు. అంటే వరుణ్‌తేజ్‌కి ఇతర నిర్మాతలలో మంచి హిట్స్ వచ్చి వరుణ్‌తేజ్ రేంజ్ పెరిగిన తర్వాత మాత్రమే ఆయన నిర్మాతగా సేఫ్‌గేమ్ ఆడనున్నాడని తెలుస్తోంది. ఇక ఈయన కుమారుడు వరుణ్‌తేజ్ మాత్రమే కాదు కుమార్తె నిహారిక కూడా నటనలో బాగానే రాణిస్తున్నారు. ఇక నాగబాబు 'జబర్థస్త్' షో ద్వారా బిజీగా మారి, తన సంపాదన, తన కొడుకు, కుమార్తె సంపాదనల వల్ల కాస్త ఆర్దికంగా స్ధిరపడిన తర్వాతే మరలా నిర్మాణం వైపు అడుగులు వేశాడని చెప్పుకోవాలి....!