కొన్నికొన్ని పాత్రలకు కొందరిని మనం ముందుగా అనుకుంటూ ఉంటాం. ఆల్‌రెడీ అలాంటి క్రేజ్ ఉండేవారిని అలాంటి తరహా మైండ్‌సెట్‌తోనే చూస్తూ ఉంటాం కానీ కొందరు దర్శకులు మాత్రం కొందరు నటీనటుల విషయంలో వారి ఇమేజ్‌తో సంబంధంలేని పాత్రల్లో ఊహించుకుని దానిని నెరవేరుస్తూ ఉంటారు. ఇక 'భలే భలే మగాడివోయ్' చిత్రంలో దర్శకుడు మారుతి ఏకంగా విలన్‌గా నటించే మురళీశర్మని తనదైన శైలిలో చూపించి మెప్పించాడు. అది ఆయన విజన్‌కి అద్దం పడుతుంది.
ఇక తాజాగా 'భరత్ అనే నేను' చిత్రం విషయంలో కూడా కొరటాల శివ 'స్పీకర్' పాత్రకు వ్యాంప్ పాత్రలు చేసే జయలలితను తీసుకుని విజయం సాధించాడు. నిజంగా స్పీకర్ పాత్రకు జయలలిత ఎంపిక ఒక సాహసమనే చెప్పాలి. అందరూ వ్యాంపుగా చూసే కళ్లతో కొరటాల శివ వ్యాంప్ పాత్రలు చేసే జయలలిత చేత స్పీకర్ పాత్రను వేయించడం ఎంతో డేరింగ్ స్టెప్పు అనే చెప్పాలి. దీనిపై కొరటాల శివ స్పందిస్తూ, జయలలిత గారు ఎంతో హుందాగా కనిపిస్తారు. ఆమె చేసిన కొన్నిసీరియల్స్ చూశాను. గౌరవంగా ఆమె మాట్లాడే తీరు గురించి నాకు తెలుసు. ఆమె చాలా హుందాగా అనిపిస్తారు. అందువల్ల ఈవిడైతే స్పీకర్ పాత్రకి బాగా ఉంటుందని అనిపించింది. అదే విషయాన్ని మహేష్‌బాబుకి చెబితే, నా ఇష్టానికే ఆయన వదిలేశారు. మా టీం నా నిర్ణయం సరైనదే అన్నారు. సెట్‌లో స్పీకర్ చైర్‌లో ఆమె కూర్చున్న తర్వాత నాకు తృప్తిగా అనిపించింది అనిచెప్పుకొచ్చాడు.
ఇక జయలలిత ఈ విషయం గురించి మాట్లాడుతూ.. అందరికీ వ్యాంపుగా కనిపించే నేను కొరటాలగారికి అమ్మలా కనిపించాను. ఈ ఉద్వేగం ఎంతో ఆనందం కలిగిస్తోందని చెప్పుకొచ్చింది. మొత్తానికి ఇంత కాలం వ్యాంపుగా పరిచయమైన జయలలితకు ఈ చిత్రం 'మంజు భార్గవి'కి 'శంకరాభరణం' ఎలానో.. జయలలితకు 'భరత్ అనే నేను' అలా అని చెప్పవచ్చు.