అనిల్‌కపూర్ కూతురు సోనమ్ కపూర్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. ఈమె ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్ అహుజాతో డేటింగ్ చేస్తోంది. తాజాగా వీరి ఇంటిని కూడా విద్యుత్ దీపాలతో అలంకరించారు. మరోవైపు సంగీత్‌కి సంబంధించి, పెళ్లికి సంబంధించి పలు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇక శ్రీదేవి మరణంతో డీలా పడ్డ బోనీకపూర్ ఫ్యామిలీకి ఈ వివాహం కాస్త ఆనందాన్ని కలిగిస్తోందనే చెప్పాలి.
తాజాగా తన పెళ్లిపై, సినిమాలలో తన జీవితం గురించి ఆమె ముచ్చటించింది. ఆమె మాట్లాడుతూ.. పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్నా నేను సినీనటులతో ఎప్పుడు డేటింగ్ చేయలేదు. తెరపై కెమిస్ట్రీ పండించినా తెర వెనుక మాత్రం హీరోలతో నాకు సాన్నిహిత్యం లేదు. ఇన్నేళ్ల నా కెరీర్‌లో నా పేరు ఇతర నటీనటులతో కలిపి ఇప్పటివరకు గాసిప్స్‌లు రాని విషయం తెలిసిందే. నేను సినిమాలలో నటించే హీరోలు నాడు పలువురితో రిలేషన్‌లో ఉన్నారు. దాంతోవారితో చనువుగా మెలిగే స్పేస్ నాకు రాలేదు.
ఇక ఈమె రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్న ఆనంద్ అహూజాతో 8వ తేదీన వివాహం జరుగనుంది. వీరి వివాహాన్ని ఇరు కుటుంబాల పెద్దలు దృవీకరించారు. ఈ వివాహం అనంతరం సోనమ్‌కపూర్ కేన్స్‌లో జరిగే ఫిల్మ్‌ఫెస్టివల్స్‌లో రెడ్ కార్పెట్‌తో నడించేందుకు వెళ్తుంది. అనంతరం ఇండియాకి వచ్చి 'వీరే ది వెడ్డింగ్' సినిమా ప్రమోషన్‌లో పాల్గొననుంది. మొత్తానికి బాలీవుడ్‌లో అనుష్కశర్మ, విరాట్‌కోహ్లి తర్వాత జరుగుతున్న వివాహం వీరిదే. ఇక త్వరలో దీపికాపడుకోనే, రణవీర్‌సింగ్‌ల వంతు కూడా వస్తుందని బాలీవుడ్ మీడియా కోడైకూస్తోంది.