అక్కినేని నాగార్జున తన ఇద్దరి కొడుకులని ఒక లైన్ లో పెట్టే పనిలో ఉన్నాడు. ఆల్రెడీ నాగ చైతన్య లైఫ్ సెట్ చేసాడు. చైతు ఇప్పుడు తన సొంత నిర్ణయాలు తీసుకుని సినిమాలు చేస్తున్నాడు. చైతు గురించి నాగ్ ఆలోచించాల్సిన పని లేదు. ప్రస్తుతం అతడి కోసం నిర్మాతలు.. దర్శకులు బాగానే పోటీ పడుతున్నారు.
అయితే ఇప్పుడు నాగ్ సమస్యల్లా తన రెండో కొడుకు అఖిల్ గురించే. అఖిల్ చేసిన రెండు సినిమాలు చేదు అనుభవాన్ని ఇచ్చాయి. 'అఖిల్' సినిమాలో జరిగిన తప్పులన్నీ సరిదిద్దుకుని.. అన్నీ పక్కాగా సెట్ చేసినప్పటికీ ‘హలో’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. మళ్లీ నాగ్ ఇప్పుడు అన్ని అలోచించి మూడవ సినిమాను 'తొలిప్రేమ' సినిమాను తీసిన వెంకీ అట్లూరి చేతులో పెట్టాడు.
కాంబినేషన్ అయితే సెట్ చేసాడు కానీ అతడి రేంజ్ పెంచి, మార్కెట్ క్రియేట్ చేయగలడా అంటే మాత్రం సందేహమే. ఈ నేపథ్యంలో అఖిల్ నాలుగవ మూవీ కోసం కొరటాల శివను ట్రై చేస్తున్నాడు నాగ్. కానీ కొరటాల దొరకడం లేదు. 'భరత్ అనే నేను' సినిమా తర్వాత కొరటాల ఏ సినిమాకు కమిట్ అవ్వలేదు. అల్లు అర్జున్ - కొరటాల కాంబినేషన్ ఓ మూవీ వస్తుందని వార్తలు వచ్చాయి కానీ అల్లు అర్జున్ రూట్ మార్చి విక్రమ్ కుమార్ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడని సమాచారం. కొరటాల.. నానితో సినిమా చేసే ప్రతిపాదన కూడా ఉన్నప్పటికీ.. నాగ్ అడ్డం పడి అఖిల్ కోసం చేయాల్సిందే అని ఆయన్ని కమిట్ చేయించినట్లు సమాచారం. మరి ఆర్జీవి.. అఖిల్ తో తన నెక్స్ట్ మూవీ అనౌన్స్ కూడా చేసాడు. మరి ఎవరితో అఖిల్ నాలుగవ సినిమా ఉంటుందని చూడాలి. అన్ని కుదిరితే కొరటాల - అఖిల్ ల సినిమా ఈ ఏడాది చివర్లో మొదలయ్యే అవకాశాలున్నాయి.