Advertisementt

సమంత క్లాప్స్ కొట్టేలా మెప్పిస్తున్నారు!

Fri 04th May 2018 03:37 PM
samantha,mahanati,big contest  సమంత క్లాప్స్ కొట్టేలా మెప్పిస్తున్నారు!
Celebrate Savitri Contest from Mahanati సమంత క్లాప్స్ కొట్టేలా మెప్పిస్తున్నారు!
Advertisement
Ads by CJ

పెళ్లయితే హీరోయిన్ల క్రేజ్‌ తగ్గుతుంది అనే మాటకు నేటితరంలో ఫుల్‌స్టాప్‌ పెట్టిన టాలీవుడ్‌ నటిగా సమంతను చెప్పుకోవాలి.. పెళ్లి తర్వాత ఆమె నటించిన 'రాజుగారిగది2'లో కీలకమైన పాత్ర ఆమెదే. ఇక 'రంగస్థలం'లో కూడా రామలక్ష్మిగా అదరగొట్టేస్తోంది. ఇక ఈనెల 9వ తేదీన ఆమె 'మహానటి' ద్వారా, మే 11న విశాల్‌ 'అభిమన్యుడు' ద్వారా మూడురోజుల్లో రెండు చిత్రాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. ఇక ఈమె టాప్‌ హీరోయిన్‌ అయి ఉండి 'మహానటి'లో జర్నలిస్ట్‌ మధురవాణిగా సపోర్టింగ్‌ రోల్‌ చేయడం సాహసమేనని చెప్పాలి. 

దీని గురించి సమంత మాట్లాడుతూ.. మహానటి సావిత్రి గారి బయోపిక్‌లో నటించడం ఎంతో గర్వంగా ఉంది. ఈ చిత్రంలో నా పాత్ర ప్రభావం కూడా కాస్త ఉంటుంది. అందుకే ఈ చిత్రానికి నేను రిస్క్‌ తీసుకున్నాను. కానీ తప్పనిసరిగా ఓ మహానటి గురించి ప్రజలకు చెప్పే పాత్ర ద్వారా కనిపిస్తుండటం విశేషం. ఈ సినిమాలో నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పాను. అందుకు కారణం మూవీలో ఓ సీన్‌ ఉంటుంది. నేను హీరోయిన్‌ని అయి వుండి మరో మహానటి గురించి చెప్పే సీన్‌ అది. ఆ ఒక్క సన్నివేశం కోసమే ఈ చిత్రంలో నటించాను అని చెప్పుకొచ్చింది.

ఇక ఇటీవల సమంత 'మాయాబజార్‌'లోని సావిత్రి నర్తించిన 'ఆహనా పెళ్లంట.. ఓహోనా పెళ్లంట' అనే పాటకు స్టెప్పులు వేస్తూ, వైజయంతీ మూవీస్‌ మహానటి ఫన్‌ చాలెంజ్‌ పేరిట ఓ కాంపిటీషన్‌ని పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో ఎవరైనా సరే ఆ పాటకు స్టెప్పులు వేసి, వీడియోలను తమ ట్విట్టర్‌ అకౌంట్‌ని పోస్ట్‌ చేస్తే అందులో బాగా చేసినవారిని టీం ఎంపిక చేసి, గిఫ్ట్‌లు ఇస్తుంది. ఇక ఈ చాలెంజ్‌కి స్పందన బాగా వస్తోంది. చాలా మంది అమ్మాయిలు ఆ పాటకు డ్యాన్స్‌ చేస్తూ వీడియోలను పంపుతున్నారు. వీరిలో చిన్నపిల్లలు చేసిన డ్యాన్స్‌ వీడియోలు కూడా చాలా ఉన్నాయి. అలా చిన్నపిల్లలు చేసినడ్యాన్స్‌ని చూసి సమంత ఆ వీడియోలను తన ట్విట్టర్‌లో పెట్టడమే కాదు.. లవ్లీ అంటూ చెబుతూ, చప్పట్లు కొట్టింది. 

Celebrate Savitri Contest from Mahanati:

>Samantha Fun Challenge Contest goes to big success

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ