Advertisementt

త్రిష పుట్టినరోజు కబుర్లు వినండి!

Fri 04th May 2018 03:30 PM
trisha,heroine,chit chat,heroine trisha,birthday  త్రిష పుట్టినరోజు కబుర్లు వినండి!
Trisha Birthday Chit Chat with Fans త్రిష పుట్టినరోజు కబుర్లు వినండి!
Advertisement
Ads by CJ

వయసు 35ఏళ్లు వచ్చినా ఇప్పటికీ హీరోయిన్‌గా, తన ఫిట్నెస్‌ని మెయిన్‌టెయిన్‌ చేస్తూ రావడం చెన్నై చిన్నది త్రిష విషయంలో జరుగుతోంది. ఆమె సీనియర్‌ స్టార్స్‌ అయిన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ల నుంచి యంగ్‌ హీరోలైన ప్రభాస్‌, మహేష్‌బాబు, సిద్దార్ద్‌, ఎన్టీఆర్‌ వంటి వారితో కూడా యాక్ట్‌ చేసింది. కాగా ఈమె జన్మదినం మే 4వ తేదీ. ఆ రోజున ఆమె 35వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఆమె అభిమానులతో ట్విట్టర్‌తో చాట్‌ చేశారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పింది. నా సినిమాలు లేట్‌ కావడానికి కారణం నా నిర్మాతలను అడగండి. నేను ప్రేమ పెళ్లే చేసుకుంటాను. తెలుగు సినిమా ఎప్పుడు చేస్తానో ఎదురు చూడాల్సిందే. హాలీవుడ్‌ సినిమాలలో తప్పకుండా నటిస్తాను. ప్రభాస్‌ అంటే నాకెంతో ఇష్టం. చిరంజీవి గారు జెంటిల్‌మేన్‌. మహేష్‌ బాబు నా బెస్ట్‌ సహనటుడు. ఆయనెంతో సరదాగా ఉంటారు. నా తర్వాతి ఆప్షన్‌ 'భరత్‌ అనే నేను' చూడటమే. రాజకీయాలలోకి ఈ సమయంలో అయితే రాను. నాకన్న పదేళ్లు చిన్న అయినా నన్ను చేసుకోవడానికి మీకు ఓకే అయితే నాకు ఓకేనే. అనుష్కశెట్టి స్వీట్‌పర్సన్‌... అంటూ సరదాగా సమాధానాలు చెప్పింది. ఇక మీ కోసం నేను బ్యాచ్‌లర్‌గా ఉండి ఎదురుచూస్తున్నాను? అని ఓ అభిమాని అడగటంతో మీవయసెంత అని త్రిష అడగటం, మీకన్నా పదేళ్లు చిన్నవాడిని నన్నుపెళ్లి చేసుకుంటారా? అని అడిగితే మీకు ఓకే అయితే నాకు ఓకే అంటూ సమాధానాలు చెప్పడం సరదాగా సాగాయనే చెప్పాలి...!

Trisha Birthday Chit Chat with Fans:

Trisha Birthday special Artical

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ