Advertisementt

బన్నీది ట్రిక్‌ కాదట!

Fri 04th May 2018 03:25 PM
allu arjun,astonishing,cap tricks step,naa peru surya naa illu india  బన్నీది ట్రిక్‌ కాదట!
Allu Arjun's Cap Tricks Rocking బన్నీది ట్రిక్‌ కాదట!
Advertisement
Ads by CJ

 

'నాపేరు సూర్య...నా ఇల్లుఇండియా'లో అల్లుఅర్జున్‌ వేసిన స్టెప్స్‌ని ప్రోమోగా విడుదల చేస్తే అవి అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా బన్నీ క్యాప్‌తో చేసిన ట్రిక్స్‌ అద్భుతం అనిపిస్తున్నాయి. వీటిని చూస్తే ఒకనాడు మైఖేల్‌ జాక్సన్‌ చేసిన ట్రిక్స్‌ని మైమరిపిస్తున్నాయి. అయితే ఈ ట్రిక్‌ నిజమేనా లేక ఏదైనా గ్రాఫిక్స్‌ మాయా జాలమా అనిపిస్తోంది. కానీ ఈ క్యాప్‌ ట్రిక్‌ని ఎంతో కాలం సాధన చేసి బన్నీ సొంతగా చేశాడట. ప్రతిరోజు షూటింగ్‌ పూర్తయిన వెంటనే ఈ క్యాప్‌ ట్రిక్‌ కోసం గంటల కొద్ది సాధన చేశాడట. ట్రైనర్స్‌ వచ్చి గ్రాఫిక్స్‌లో మెయిన్‌టెయిన్‌ చేయవచ్చని చెప్పినా బన్నీ ఒప్పుకోకుండా తానే స్వయంగా చేసాడట.

తాజాగా బన్నీ ఈ చిత్రానికి సంబంధించిన రెండు వీడియోలను పోస్ట్‌ చేశాడు. అందులో ఒకటి క్యాప్‌ ట్రిక్‌ కోసం బన్నీ చేసిన కృషిని తెలిపేదైతే. రెండోది బన్నీ వేసిన కొత్త స్టెప్పుల హంగామా ఉంది. ఇక క్యాప్‌ ట్రిక్‌ని 'లవర్‌ ఆల్సో.. ఫైటర్‌ ఆల్సో' అనే పాటలో చేశాడు. ఇందుకోసం ట్రైనింగ్‌ తీసుకుంటుండగా ఓ వీడియోను పోస్ట్‌ చేశాడు. ఇలాంటి ట్రిక్‌లను ఎన్నింటినో బన్నీ నేర్చుకుని మరీ ప్రదర్శించాడని యూనిట్‌ అంటోంది. అందుకే బన్నీని తెలుగులో స్టైలిష్‌స్టార్‌ అన్నారు. ఆయన జూనియర్‌ రజనీకాంత్‌లా ఇలా స్టైల్స్‌లో మెప్పిస్తున్న విషయం తెలిసిందే. 

'డిజె' చిత్రంలో 'ఫ్రిడ్జెంట్‌ స్పిన్నర్‌'ని తిప్పడాన్ని ఓ ఫ్యాషన్‌గా బన్నీ మార్చేశాడు. ఇక ఈ క్యాప్‌ ట్రిక్‌ కూడా థియేటర్లలో విజిల్స్‌ వేయించి, ప్రేక్షకులను ఎంతగానో అలరించేలా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రం హైలైట్స్‌లో దీనిని కూడా ఒకటిగా చెప్పాలని వక్కంతం వంశీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలోబన్నీ వేసే స్టెప్పులు కూడా ఉర్రూతలూగించడం ఖాయంగా చెబుతున్నారు. 

Allu Arjun's Cap Tricks Rocking:

>Allu Arjun Astonishing Cap Tricks Step

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ