Advertisementt

ఈ కమెడియన్‌ ఉబ్బితబ్బిబవుతున్నాడు!

Fri 04th May 2018 03:24 PM
ntr,jabardasth mahesh,mahanati,rangasthalam  ఈ కమెడియన్‌ ఉబ్బితబ్బిబవుతున్నాడు!
NTR Makes Rangasthalam Actor Mahesh Happy ఈ కమెడియన్‌ ఉబ్బితబ్బిబవుతున్నాడు!
Advertisement
Ads by CJ

నేడు దర్శకులే కాదు.. సాంకేతిక నిపుణులు, నటీనటులు కూడా సులభంగానే చాన్స్‌లు సాధిస్తున్నారు. టాలెంట్‌ ఉంటే తమని తాము నిరూపించుకోవడానికి షార్ట్‌ఫిల్మ్స్‌ని నుంచి వెబ్‌ సిరీస్‌లు, 'జబర్ధస్త్‌' వంటి పలు టీవీ షోలు కూడా వారికి సినీ కెరీర్‌ని ప్రసాదిస్తున్నాయి. ఇక ఈమద్య వచ్చిన కమెడియన్లలో 'పెళ్లిచూపులు, స్పైడర్‌' చిత్రాల ద్వారా ప్రియదర్శి తనదైన నటనతో మెప్పించాడు. 

ఇక తాజాగా 'రంగస్థలం' చిత్రంలో రామ్ చరణ్ పక్కన నటించిన 'జబర్దస్త్‌' మహేష్‌కి కూడా ఎన్నో ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ చిత్రం చూసిన మహేష్‌బాబు సైతం మహేష్‌ని తనని కలవాలని కోరిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా 'జబర్ధస్త్‌' మహేష్‌కి యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ నుంచి కూడా ప్రశంసలు లభించాయి. ప్రస్తుతం మహేష్‌ 'మహానటి'లో యాక్ట్‌ చేస్తున్నాడు. ఈ చిత్రం ఆడియో వేడుక సందర్భంగా స్పెషల్‌ గెస్ట్‌గా వచ్చిన జూనియర్‌ ఎన్టీఆర్‌ మహేష్‌ని పక్కన కూర్చొబెట్టుకుని మాట్లాడటం సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఇక ఈ సంఘటనను తలుచుకుని మహేష్‌ ఉబ్బితబ్బిమవుతున్నాడు. 

ఈ విషయంపై మహేష్‌ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ ఏం మాట్లాడారో చెప్పాడు. బ్రదర్‌ మీరు షేక్‌ చేశారు. అదిరిపోయింది. మీ సీన్‌ చూసినప్పుడు ఎంతో ఎమోషన్‌ ఫీలయ్యాను. మనం మరలా కలుద్దామని ఎన్టీఆర్‌ అన్నాడట. తాను కింద కూర్చుని ఎన్టీఆర్‌తో మాట్లాడుతూంటే బలవంతంగా పక్కన కూర్చుంటే కానీ ఒప్పుకోలేదు. నాతో ఎన్టీఆర్‌ అన్న గోల్డెన్‌ వర్డ్స్‌ ఇవి. ఆయనతో మాట్లాడిన తర్వాత అర్ధమైంది ఆయన ఎంత గొప్పవారో...లవ్‌ యు సోమచ్‌ ఎన్టీఆర్‌ అన్నా...'మహానటి'లో నటించినందుకు ఎంత హ్యాపీగా ఫీలవుతున్నానో, మహానటునితో మాట్లాడినందుకు కూడా అంతే హ్యాపీగా ఫీలవుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌ సార్‌కి కృతజ్ఞతలు.. అని జబర్దస్త్‌ మహేష్‌ చెప్పుకొచ్చాడు. మరలా కలుద్దాం అని జూనియర్‌ అన్నాడంటే ఆయన రాబోయే చిత్రాలలో వేటిలోనైనా మహేష్‌ని పెట్టుకుంటాడని అనిపిస్తోంది..! 

NTR Makes Rangasthalam Actor Mahesh Happy:

>NTR Turned Emotional For Mahesh

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ