అల్లు అర్జున్ హీరోగా అను ఇమ్మాన్యువల్ హీరోయిన్ గా కొత్త దర్శకుడు వక్కంతం వంశీ దర్శకుడిగా.... నాగబాబు, లగడపాటి శ్రీధర్ సంయుక్తంగా నిర్మించిన నా పేరు సూర్య సినిమా ప్రపంచవ్యాప్తంగా మరికొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లోనూ, ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం రెండు భారీ సినిమాలను హిట్ చేసిన ప్రేక్షకులు నా పేరు సూర్య ని కూడా హిట్ చేస్తారనే నమ్మకంతో అల్లు అర్జున్ ఉన్నాడు. రంగస్థలం, భరత్ అనే నేను సినిమాలు ప్రస్తుతం భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా సినిమాపై ఉన్న అంచనాలతో విడుదలకు ముందే 85 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా రాబట్టింది. మరి ఈ లెక్కన ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అంటే ఈసినిమాపై ట్రేడ్ వర్గాల్లో ఉన్న అంచనాలు ఏపాటివో తెలుస్తుంది. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది అంటే అల్లు అర్జున్ తన స్టామినాని ఈ సినిమాతో చూపిస్తాడు. ఇక ఏరియాల వారీగా నా పేరు సూర్య ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇలా వున్నాయి.
ఏరియా ప్రీ రిలీజ్ లెక్కలు (కోట్లలో)
- నైజాం 21
- వైజాగ్ 8
- సీడెడ్ 12
- గుంటూరు 5.5
- పశ్చిమ గోదావరి 4.2
- తూర్పు గోదావరి 5.4
- నెల్లూరులో 2.52
- కృష్ణాలో 5
- యూఎస్ 7
- కేరళలో 3
- బెంగళూరులో 9
- సూర్య ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తం గా 85.87 కోట్లు