మే 6న ఫాస్ ఫిలిం సొసైటీ - దాసరి సినీ అవార్డుల పద్రానోత్సవం
దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల సేవలందిస్తున్న ఫిలిం ఎనాలిటికల్ అండ్ అప్రిషియేషన్ సొసైటీ(ఫాస్) - దాసరి 2018 ఫిలిం అవార్డులను మే 6న హైదరాబాద్‌లోని శ్రీత్యాగరాయ గానసభ వేదికగా ప్రదానం చేయనున్నారు. సంస్థ అధ్యక్షులు, పూర్వ సెన్సార్ బోర్డు సభ్యులు డా|| కె.ధర్మారావు ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను తెలిపారు.
ఫాస్ - దాసరి కీర్తి కిరీట సిల్వర్ క్రౌన్ అవార్డులను దర్శకులు కోడి రామకృష్ణ, టి.వి. రంగ సుప్రసిద్ధులు సుమ కనకాలకు అందజేయనున్నారు.
దాసరి జీవన సాఫల్య పురస్కారాన్ని సూపర్‌హిట్ సినీ వారపత్రిక ఎడిటర్ అండ్ పబ్లిషర్, సూపర్‌హిట్ చితాల్ర పి.ఆర్.ఓ, ప్రముఖ నిర్మాత బి.ఎ.రాజు అందుకోనున్నారు.
ఇతర అవార్డులు డైరెక్టర్ ఆఫ్ ది ఇయర్(ఫిదా) శేఖర్ కమ్ముల, ఉత్తమ గేయరచయిత సుద్దాల అశోక్‌తేజ, ఉత్తమ గాయని మధుప్రియ, ప్రశంసా దర్శకుడు అవార్డు వడ్డేపల్లి కృష్ణ(లావణ్య విత్ లవ్‌బాయ్స్), దాసరి ప్రతిభా పురస్కారాలను సంపూర్ణేష్‌బాబు, శివపార్వతి, సంగీత దర్శకులు వాసూరావు, మాటల రచయిత సంజీవి, దాసరి విశిష్ట సేవా పురస్కారాన్ని రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షుడు లయన్ డా. ఎ.నటరాజుకు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీనియర్ నటి జమున హాజరు కానున్నారు. సభాధ్యక్షులుగా కైకాల సత్యనారాయణ వ్యవహరిస్తారు. డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. సభను ప్రారంభిస్తారు. సన్మానకర్తగా ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ విచ్చేయనున్నారు. ఈ అవార్డు కార్యక్రమానికి ఛైర్మన్‌గా రేలంగి నరసింహారావు, ఫెస్టివల్ ఛైర్మన్‌గా లయన్ ఎ.విజయకుమార్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి టి.లలిత బృందం దాసరి సినీ విభావరి నిర్వహిస్తుంది. ఇదే వేదికపై డా.దాసరిపై రూపొందించిన సంక్షిప్త చిత్రాన్ని ప్రదర్శిస్తారు.