Advertisementt

మెహ్రీన్ మరో ఛాన్స్ కొట్టేసింది..!

Fri 04th May 2018 02:39 PM
mehreen kaur,nithin,venky kudumula  మెహ్రీన్ మరో ఛాన్స్ కొట్టేసింది..!
One more big chance to Mehreen Kaur మెహ్రీన్ మరో ఛాన్స్ కొట్టేసింది..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోయిన్స్ లో మెహ్రీన్ ఒకరు. ఆమె ఒక నటనతోనే కాదు గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పటివరకు మీడియం సినిమాలకే పరిమితం అయిన ఈ సుందరికి వెంకటేష్ - వరుణ్ తేజ్ మల్టీ స్టారర్ లో ఛాన్స్ కొట్టేసింది.

అంతేకాకుండా గోపీచంద్ తో 'పంతం'...విజయ్ దేవరకొండ ద్విభాషా చిత్రంగా రూపొందుతోన్న 'నోటా' సినిమాలోనూ నటిస్తోంది. ఇలా వరస ప్రాజెక్ట్స్ పై సైన్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడి చేతిలోకి మరో ఆఫర్ వచ్చి పడింది. యంగ్ హీరో నితిన్ కు జోడీగా చేసే ఛాన్స్ అమ్మడికి దక్కడం విశేషం

ప్రస్తుతం హీరో నితిన్ సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో 'శ్రీనివాస కల్యాణం' చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు అరవై శాతం కంప్లీట్ అయిపోయింది. ఈ మూవీలో నితిన్ కు జోడిగా రాశీ కన్నా చేస్తుంది. ఈ సినిమా తర్వాత నితిన్ 'ఛలో' సినిమాను తీసిన వెంకీ కుడుములతో ఒక సినిమాను ఒకే చేసాడు. ఆ మూవీలో హీరోయిన్ మెహ్రీన్ అయితే బాగుంటాదని భావించి ఆమెను సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. నితిన్ సొంత బ్యానర్లో ఈ సినిమాను రూపొందించనున్నారు. ఇలా వరస సినిమాలతో మంచి స్పీడ్ మీద ఉంది మెహ్రీన్.

One more big chance to Mehreen Kaur:

Mehreen Kaur in Nithin and Venky Kudumula Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ