Advertisementt

నా పేరు సూర్య కి పర్మిషన్ వచ్చేసింది..!

Fri 04th May 2018 02:27 PM
naa peru surya,allu arjun,special show,andhra pradesh and telangana  నా పేరు సూర్య కి పర్మిషన్ వచ్చేసింది..!
Good News To Allu Arjun Fans నా పేరు సూర్య కి పర్మిషన్ వచ్చేసింది..!
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ - వక్కంతం వంశీ కాంబినేషన్ లో రేపు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న నా పేరు సూర్య సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా కి భారీ క్రేజ్ తీసుకురావడానికి అల్లు అర్జున్ శాయశక్తులా కృషి చేసాడు. అల్లు అర్జున్ చేసిన ఈ ప్రయత్నాలన్నీ ఫలించాయనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ తో కలిసి పోవడం, మెగాస్టార్ చిరు నా పేరు సూర్య సెట్స్ కి రావడం, రామ్ చరణ్ ని నా పేరు సూర్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తీసుకురావడం వంటి విషయాలతో నా పేరు సూర్యపై ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి కలిగేలా చేశాడు అల్లు అర్జున్. ప్రస్తుతం భారీ క్రేజ్ మధ్య విడుదలకు సిద్దమవుతున్న నా పేరు సూర్య కి అన్ని కలిసొస్తున్నాయి.

మొన్నటికి మొన్న రంగస్థలం, భరత్ అనే నేను సినిమాలు విడుదలయ్యాక స్పెషల్ షోస్ తో బాగా హడావిడి చెయ్యడమే కాదు భారీగా కలెక్షన్స్ కూడా రాబట్టాయి. కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల కారణంగా నా పేరు సూర్య స్పెషల్ షోస్ కి ఏపీలో అనుమతులు లభిస్తాయో లేదో అనే అనుమానం ఉంది. కానీ ఒక్క ఏపీలోనే కాదు ఇక్కడ తెలంగాణ లో కూడా నా పేరు సూర్య స్పెషల్ షోస్ కి అనుమతులు వచ్చేసాయి.  మే 4 నుంచి 11వ తేదీ వరకు  ఉదయం 5 గంటల నుంచి 10 గంటలలోపు అదనంగా నా పేరు సూర్య షోను ప్రదర్శించనున్నారు. మరి ఈ స్పెషల్ షోతో కూడా అల్లు అర్జున్ దున్నేస్తాడన్నమాట. 

అను ఇమాన్యువల్ తో కత్తిలాంటి రొమాన్స్ చేస్తున్న ఈ ఆర్మీ ఆఫీసర్ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటాడో అనేది మరికొన్ని గంటల్లోనే తెలిసిపోనుంది.

Good News To Allu Arjun Fans:

Naa Peru Surya gets permission for its special morning shows across Andhra Pradesh and Telangana

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ