ఈ మధ్య కాలంలోఎన్టీఆర్‌లో ఎంతో పరిపక్వత కనిపిస్తోంది. దుందుడుకుగా మాట్లాడే వాడుగా ఉండే ఆయన ఇప్పుడు ఆచితూచి మాట్లాడుతున్నాడు. ఇక ఈయన తాజాగా నాగార్జునతో కలిసి 'మహానటి' ఆడియో వేడుకకు విచ్చేశాడు. ఈ సందర్భంగా యంగ్‌టైగర్ మాట్లాడుతూ.. మా తాతగారి పాత్రలో నటించడం ఈజన్మలో జరిగే పనికాదు. అది నటిస్తే జరగదు. జీవిస్తేనే సాద్యమవుతుంది. ఒక వ్యక్తిగా నటించడం కష్టమైన పని.అది నా వల్ల కాదు. నిర్మాత స్వప్న ఓ రోజు నా వద్దకు వచ్చింది. మహానటి చిత్రంలోతాతగారిలా చిన్న కామియో పాత్ర చేయాలనికోరింది. అయితే నేను నటించనని ఖచ్చితంగా చెప్పేశాను. ఆ విషయాన్ని ఇప్పటికే చాలా సార్లు చెప్పేశాను. తాత పాత్రలో నేను నటించడం అనేది ఈ జన్మలో జరిగే పనికాదు. ఆ అర్హత నాకు లేదు.ఆయన పాత్రలో నటించడం అనేది ఈ జన్మలో జరగదు. తాతగారి పాత్రను పోషించే దమ్ము, ధైర్యంనాకు లేవు. ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించిన కీర్తి, దుల్కర్, సమంత, విజయ్ వంటి వారందరికీ హ్యాట్సాఫ్ చెబుతున్నాను. చాలెంజ్‌గా తీసుకుని ఆ పాత్రలను పోషిస్తున్నవారికి అభినందనలు.
అశ్వనీదత్ గారి వైజయంతీ మూవీస్‌బేనర్ తాతయ్య చేతుల మీదుగా జరిగింది. ఇక స్వప్పమూవీస్ బేనర్ నేను నటించిన 'స్టూడెంట్ నెంబర్1'తో ప్రారంభమైంది. ఇక సావిత్రిగారివంటి మహానటి గురించి మాట్లాడే స్థాయి కూడా నాది కాదు. ఆమె హుందాతనం, గొప్పతనం గురించి ఏం మాట్లాడాలో కూడా అర్ధం కావడం లేదు. ఎక్కడ ప్రారంభించి, ఏమిమాట్లాడి, ఎక్కడ ముగించాలి? అనేది కూడా నాకు అర్ధ కావడం లేదు. ఆమె గురించి మాట్లాడాలంటే ఎన్ని జన్మలెత్తినా రాదేమో...! ఆమె ఒక నిజమైన సూపర్‌స్టార్. ఆవిడ ఎలా పోయారు అనేదానికంటే.. ఆమె ఎలా జీవించారు?అని చెప్పుకోవాలి.. అని అన్నాడు. మరోవైపు తనతాత పాత్రను తన బాబాయ్ బాలకృష్ణ చేస్తున్న తరుణంలోతనకి తన తాత పాత్రను నటించే స్థాయి, స్తోమతలేవని చెప్పడం గమనార్హం.