తెలుగులోని టాలెంటెడ్ దర్శకుల్లో ఇంద్రగంటి మోహనకృష్ణని గురించి చెప్పాలి. కంటెంట్ బేస్‌డ్, మంచి స్టోరీలను సినిమాలుగా తీయడంతో ఆయనకంటూ ఓ ప్రత్యేకశైలి. ఇక 'శమంతకమణి' తర్వాత మహేష్ బావ సుధీర్‌బాబు హీరోగా, అదితీరావుహైదరి జంటగా ఆయన తీస్తున్నచిత్రం 'సమ్మోహనం'. ఈచిత్రాన్నిసీనియర్ నిర్మాత శివలెంకకృష్ణప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రం టీజర్‌ని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేయడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల ఫోకస్ కూడా పడింది.
సినిమా ఇండస్ట్రీ అంటే పెద్దగా పడనిహీరో, సాహిత్యం, సినిమాలు ఎప్పుడు బతికే ఉంటాయని నమ్మే తండ్రి, దానిని ఒప్పుకోలేని పాత్రలో సుధీర్‌బాబులు కనిపిస్తున్నారు. ఇక ఇందులో నటించిన హీరోయిన్ అదితీరావు హైదరీ సినిమాలో హీరోయిన్ అని అనిపిస్తోంది. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈచిత్రం టీజర్‌ను సుధీర్‌బాబు పోస్ట్ చేసి.. నా హృదయానికి ఎంతో దగ్గరైన టీజర్ ఇది. ఖచ్చితంగా ఇది మీకు నచ్చుతుందని ట్వీట్టర్‌లో పేర్కొన్నాడు.
'సినిమా, సాహిత్యం' బతికే ఉంటాయి అనే నరేష్ డైలాగ్‌తో ఈ టీజర్ ప్రారంభం అయింది. 'సాహిత్యం అన్నావు ఓకే.. కానీ సినిమా అంటే హహ్హహ...' అంటూ సుధీర్‌బాబు కనిపిస్తాడు. 'అంటే సినిమాలంటే డర్టీనా? మిగిలిన ప్రపంచం అంతా క్లీనా' అంటూ సాగే ఈ టీజర్ ఎంతో 'సమ్మోహన' పరిచేలా ఉందని చెప్పవచ్చు. మరి ఈ చిత్రం ద్వారా అయినా సుధీర్‌బాబు బ్లాక్‌బస్టర్ కొడతాడేమో వేచి చూడాల్సివుంది....!