సినిమా రంగంలో తెలుగు నటీనటులపై ఉండే అపవాదు ఏమిటంటే... వారు శరీరాకృతి మీద శ్రద్ద వహించరు అనేది ప్రధాన విమర్శ. కేవలం విగ్గు మార్చడమో, కాస్ట్యూమ్స్ మార్చడం ద్వారానే ఇదే మేకోవర్ అనుకుంటారనే అపవాదు ఉంది. అదే బాలీవుడ్ విషయానికి వస్తే 50ఏళ్లు దాటిన సల్మాన్, షారుఖ్, అమీర్‌ఖాన్‌లతో పాటు అందరు బాడీ మేకోవర్‌పై దృష్టి పెడతారు. ఈ విషయంలో ఇప్పుడిప్పుడే మన హీరోల విషయంలో కూడా మార్పు వస్తోంది. ఇక ఈ విమర్శ తెలుగు నటీమణులపై ఎక్కువగా ఉంటుంది. బాలీవుడ్‌లో పెళ్లిళ్లు అయి పిల్లలు ఉన్న వారు కూడా పర్‌ఫెక్ట్ ఫిజిక్‌ని మెయిన్‌టెయిన్ చేస్తుంటే మన స్వాతిరెడ్డి, అంజలి వంటి వారు మాత్రం వాటిపై దృష్టి పెట్టరు అనేది ప్రధాన విమర్శ.
ఈ విషయం అంజలికి తెలియకపోవడమే ఆమె కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపింది. యంగ్ హీరోయిన్ అయినప్పటికీ బొద్దుగా కనిపించడంతో ఆమె కేవలం సీనియర్ స్టార్స్ సరసన, లేదా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో మాత్రమే నటిస్తూ వస్తోంది. ఇక ఇలా బొద్దుగా ఉండటం వల్లే ఆమెకి యంగ్ స్టార్స్ సరసన అవకాశాలు రావడం లేదని చెప్పవచ్చు. ఎంత నటనా టాలెంట్, అందమైన మొహం ఉన్న సరైన ఫిజిక్ లేకపోవడం వల్ల ఆమె సీనియర్ స్టార్స్‌కే పరిమితమైంది. తాజాగా మాత్రం ఈ అమ్మడు తన తప్పు తెలుసుకుని ట్రైనర్‌ని పెట్టుకుని నాజూక్కుగా మారింది. దాంతో ఇప్పుడు ఆమెకి యంగ్ హీరోల సరసన కూడా అవకాశాలు వస్తున్నాయని సంతోషంగా చెప్పింది.
ఈ విషయంపై ఆమె స్పందిస్తూ, నేను కేవలం సినిమాల కోసమే సన్నబడలేదు. నా ఫిజిక్ నాకే ఇబ్బందిగా మారింది. ఈమద్య కాలంలో బాగా బొద్దుగా తయారయ్యాను. అందుకే ప్రత్యేకంగా ట్రైనర్‌ని పెట్టుకుని సన్నబడ్డాను. గతంలో నా శరీరాకృతి మీద పెద్దగా శ్రద్ద పెట్టలేదు. అలా పెద్దదానిలా కనిపించడం నాకెరీర్‌కి కూడా మైనస్ అయింది. ఇక తన సోదరి కూడా సినిమాలలో ఎంట్రీ ఇవ్వనుందని వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ, నా సోదరికి ఇప్పటికే పెళ్లయిపోయింది. ఆమెకి నటించాలనే కోరిక, ఆలోచన రెండూ లేవని తేల్చిచెప్పింది. అన్నట్లు నిజమో కాదో గానీ రజనీకాంత్ హీరోగా కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వంలో సన్ సంస్థ నిర్మించే చిత్రంలోకూడా అంజలి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మరి అది మెయిన్ హీరోయిన్ కాకపోయినా సెకండ్ హీరోయిన్ అయ్యే అవకాశాలను తొసిపుచ్చలేం.