Advertisementt

రామ్ చరణ్ రంగస్థలం రూ. 200 కోట్లు!

Wed 02nd May 2018 03:13 PM
ram charan,rangasthalam,200 crores,sukumar,samantha  రామ్ చరణ్ రంగస్థలం రూ. 200 కోట్లు!
Rangasthalam Enters 200 Crore Club రామ్ చరణ్ రంగస్థలం రూ. 200 కోట్లు!
Advertisement
Ads by CJ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా చిత్రం 'రంగస్థలం'. కమర్షియల్ హంగులతో రూపొందిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుతుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి నెల కావొస్తున్నా సినిమాపై హైప్ అలానే ఉంది. నిన్న ఈ చిత్రంకి సంబంధించి మేకర్స్ ఓ అఫిషియల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.

ఈ చిత్రం రూ. 200 కోట్లను రాబట్టింది అని అఫిషియల్ గా ఓ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ ను మైత్రీ మూవీ మేకర్స్ వారు తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. నెల రోజుల వ్యవధిలోనే ఇంత భారీ కలెక్షన్లు రాబట్టి, 'బాహుబలి' చిత్రాల తరువాత ఈ ఘనత సాధించిన రెండో సినిమాగా నిలిచింది.

మరోపక్క రామ్ చరణ్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్లు కూడా ఇవే కావడం గమనార్హం. ఈ చిత్రం వచ్చిన 20 రోజులు తర్వాత  మహేష్ 'భరత్ అనే నేను' వచ్చింది. ఇప్పటికే రూ.180 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి, 'రంగస్థలం'తో పోటీపడుతూ దూసుకెళుతోంది.

Rangasthalam Enters 200 Crore Club:

Ram Charan and Samantha Akkineni's Rangasthalam enters the 200 Crores club

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ