తాజాగా 'రంగస్థలం' చిత్రం మేజిక్ స్టార్ట్ అయి నెల అయింది. నేటి రోజుల్లో ఎంత పెద్ద, ఎంత గొప్ప సినిమా అయినా రెండు మూడు వారాల కంటే స్టడీ కలెక్షన్లు సాధించలేకపోతున్నాయి. తాజాగా 'రంగస్థలం'తో చిట్టిబాబు 200కోట్లు కొల్లగొట్టాడని ఈ రోజు పత్రికల్లో ప్రకటనలు వచ్చాయి. నెలరోజులు దాటినా కూడా ఈ చిత్రం ఇంకా స్టడీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. చిత్ర నిర్మాతలు 'రంగస్థలం'ని బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ టిఎఫ్‌ఐ అంటున్నారు. ఇక ఈ చిత్రం ఇంతవరకు 'నాన్‌బాహుబలి' రికార్డులను తన పేరుతో లిఖించుకున్న మెగాస్టార్ ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీనెంబర్ 150'ని చాలా పెద్ద మార్జిన్‌తో దాటి వేసింది. ఇదే విషయాన్ని తాజాగా డల్లాస్‌లో ఉన్న చిరు వద్ద ప్రస్తావించగా, తాను నెలకొల్పిన నాన్‌బాహుబలి రికార్డును చరణ్ దాటివేశాడని, మరి రాబోయే 'సైరా...నరసింహారెడ్డి'తో ఆ లెక్కలు సరిచేస్తానని హర్షధ్వానాల మధ్య ప్రకటించాడు.
ఇక 'రంగస్థలం' వచ్చి నెలరోజుల తర్వాత ఈ చిత్రాన్ని చూసిన ఏపీ ఐటీ. పంచాయతీరాజ్ మంత్రి లోకేష్ ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించాడు. తెలుగు ప్రేక్షకులకు 'రంగస్థలం' వంటి చిత్రాన్ని అందించిన సుకుమార్, రామ్‌చరణ్‌లు శుభాకాంక్షలు తెలుపుతూ, చిత్రం అయిపోయిన తర్వాత కూడా ఈ చిత్రంలోని పాత్రలు మనల్ని వెంటాడుతుంటాయని తెలిపి, గ్రేట్ వర్క్ గైస్ అని అభినందించాడు. ఒకవైపు కేటీఆర్ 'భరత్ అనే నేను'ని దత్తత తీసుకుంటే లోకేష్ కాస్త ఆలస్యంగా అయినా 'రంగస్థలం'ని మెచ్చుకున్నాడు.
ఇక రామ్‌చరణ్ 'రంగస్థలం' విషయానికి వస్తే నాడు బాలకృష్ణ సినిమాలు వసూలు చేసిన కలెక్షన్లను ఆయన తండ్రి ఎన్టీఆర్ 'మేజర్ చంద్రకాంత్'తో తిరగరాశాడు. మరి 'రంగస్థలం' విషయంలో చిరంజీవి 'సైరా... నరసింహారెడ్డి' ద్వారా 'రంగస్థలం' రికార్డులను బద్దలు కొట్టే అవకాశాలే ఉన్నాయి. ఇక 'రంగస్థలం' చిత్రంలో రంగమ్మత్త పాత్ర ద్వారా అందరినీ మెప్పించిన అనసూయ తాజాగా ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ఖచ్చితంగా నెలరోజుల ముందు 'రంగస్థలం'కి చెందిన మ్యాజిక్ ప్రపంచానికి చూపించామని చెబుతూ, నాటి షూటింగ్‌లోని కొన్ని మధుర జ్ఞాపకాలను ఆమె తన ఫోటోల ద్వారా పంచుకుంది. ఇంకా అనసూయ రంగస్థలం మేనియాలోనే ఉందని, సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తోందని చెప్పవచ్చు.