Advertisementt

వారిద్దరి అభినందనలతో కొరటాల ఫుల్ హ్యాపీ!

Wed 02nd May 2018 02:38 PM
koratala siva,bharat ane nenu,ktr,jayaprakash narayan  వారిద్దరి అభినందనలతో కొరటాల ఫుల్ హ్యాపీ!
Koratala Full happy with Jayaprakash Narayan and KTR Comments on BAN వారిద్దరి అభినందనలతో కొరటాల ఫుల్ హ్యాపీ!
Advertisement
Ads by CJ

కాస్త కేటీఆర్‌ అయినా నయం. ఆయన తరుచుగా చిత్రాలు చూస్తూ తనకు నచ్చిన వాటిని పొగుడుతూ ఉంటారు. 'ఫిదా, అర్జున్‌రెడ్డి, తొలిప్రేమ' వంటి చిత్రాల విషయంలో ఆయన నిర్మాతలను ప్రత్యేకంగా అభినందించాడు. ఇక ఈయన నేటి యంగ్‌ జనరేషన్‌ రాజకీయ నాయకులకు రాను రాను ఐకాన్‌గా కేటీఆర్‌ మారుతున్నాడు. రాజకీయాలలో తనదైనశైలిని ఆయన చూపిస్తున్నాడు. రాజకీయ నాయకుడంటే ఇలా కూడా ఉండవచ్చా? అన్నది కేటీఆర్‌ని చూసి చాలా మంది నేర్చుకోవాల్సివుంది. 

ఇక భరత్ అనే నేను చూసిన వెంటనే కేటీఆర్‌ కొరటాలశివకు ఫోన్‌చేసి 'ఇలాంటి కధా వస్తువును తీసుకున్నప్పుడు ఏమాత్రం తేడా వచ్చినా అది డాక్యుమెంటరీ అయిపోతుంది. అలా కాకుండా కమర్షియల్‌ అంశాలకు కూడా ప్రాధాన్యం ఇస్తూ, చాలా బాగా డీల్‌ చేశారని మెచ్చుకున్నాడట. ఈ పొగడ్త తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని కొరటాలశివ చెప్పుకొచ్చాడు. నిజంగా కేటీఆర్‌ ఈ విషయాన్నిచాలా బాగా గ్రహించాడు. ఆయన చెప్పినట్లు ఏమాత్రం తేడా వచ్చినా ఇది కేవలం రివార్డులకు పనికిరాకుండా అవార్డుల చిత్రంగా మాత్రమే మిగిలేది. ఈ విషయంలో సినిమాలపై కేటీఆర్‌కి ఉన్న అవగాహన అద్భుతమనే చెప్పాలి. 

ఇక రెండు తెలుగు రాష్ట్రాలలోని మేధావులలో లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌నారాయణ్‌ ముఖ్యులు. ఆయన ఐఏయస్‌గా పనిచేస్తూ ఎందరో రాజకీయ నాయకులను దగ్గర నుంచి చూశాడు. ఇక లోక్‌సత్తా అనే సంస్థను రాజకీయ పార్టీగా మార్చి రాజకీయాలలో మేధావిగా కొనసాగుతున్నాడు. ఇక జెపికి సినిమాలు చూసే అలవాటు లేదు. కానీ ఆయన 'భరత్‌ అనే నేను' చిత్రానికి వచ్చిన టాక్‌ని చూసి సినిమా చూసి ఎంతగానో మెచ్చుకున్నాడట. అలా ఎప్పుడు సినిమాల గురించి మాట్లాడని జెపి 'భరత్‌ అనే నేను' చూసి నన్ను అభినందించడం చాలా ఆనందం కలిగించిందని, ఇలా కేటీఆర్‌, జయప్రకాష్‌నారాయణ్‌లు నన్నుమెచ్చుకోవడం ఎప్పటికీ మర్చిపోలేనని కొరటాలశివ చెప్పుకొచ్చాడు. 

Koratala Full happy with Jayaprakash Narayan and KTR Comments on BAN:

Jayaprakash Narayan and KTR Praises Bharat Ane Nenu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ