ప్రస్తుతం మెగా హీరో సాయి ధరమ్ కు కచ్చితంగా ఓ హిట్ కావాలి. అతను హిట్ కొట్టి చాలా ఏళ్ళు అయిపోయింది. ప్రస్తుతం అతని హోప్ మొత్తం కరుణాకరన్ తెరకెక్కిస్తున్న సినిమాపైనే ఉంది. అటు డైరెక్టర్ కరుణాకరన్ కి కూడా ఈ సినిమా కీలకంగా మారింది. అతనికి కూడా ఈ మధ్యకాలంలో ఒక హిట్ సినిమా కూడా లేదు. వీరిద్దరి భవిషత్తు 'తేజ్ ఐ లవ్ యు' సినిమాపైనే ఆధారపడి ఉంది.
ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ గత రెండు రోజులు కిందటే సోషల్ మీడియాలో రిలీజ్ చేసారు మేకర్స్. టైటిల్ బట్టి చూస్తుంటే ఇది ఒక రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ అని అర్ధం అవుతుంది. ఈ సినిమాలో తేజుకి జోడిగా మలయాళం బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు.
వర్షం పడుతుంటే.. బస్సు స్టాప్ లో హీరో సాయి ధరమ్ తేజ్ నిలబడి వేడివేడిగా 'టీ' తాగుతుంటాడు. పక్కన కొంచం దూరంలో కూర్చుని అనుపమ 'గిటార్' మీటుతూ ఉంటుంది అక్కడున్న ఆమె హఠాత్తుగా అతని అక్కున చేరి 'టీ' షేర్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. అంతలో రోడ్ పై వెళుతోన్న వెహికల్ హారన్ సౌండ్ కి హీరో ఈ లోకంలోకి వస్తాడు. అదంతా భ్రమేననుకుని నవ్వుకుంటాడు హీరో సాయి ధరమ్ తేజ్. టీజర్ చూస్తుంటే పాజిటివ్ గానే ఉంది మరి సినిమా ఎలా ఉంటాదో చూడాలంటే ఈ సమ్మర్ వరకు ఆగాల్సిందే.