చాలాకాలం తర్వాత 'పీఎస్వీ గరుడ వేగ' సినిమాతో ఫామ్ లోకి వచ్చాడు సీనియర్ హీరో రాజశేఖర్. ఈ సినిమా తన కెరీర్ ని మార్చేసింది. ‘అ!’ లాంటి వైవిధ్యమైన సినిమాతో దర్శకుడిగా సత్తా చాటిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ ఓ వైవిధ్యమైన సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.
దీంతో పాటుగా సూపర్ స్టార్ రజినీకాంత్ చిన్న కూతురు సౌందర్య ఓ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. ఆ సినిమాలో రాజశేఖర్ నటిస్తున్నాడు. ఇందులో ఓ కీలక పాత్ర కోసం రాజశేఖర్‌ను అడిగిందట సౌందర్య . ఆయన కూడా తన పాత్ర నచ్చి ఈ సినిమా చేయడానికి అంగీకరించారట.
ఈ రెండు సినిమాలే కాకుండా తెలుగులో రామ్ హీరోగా ప్రవీణ్ సత్తారు ఓ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం రాజశేఖర్ ను ఎంపిక చేశారనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఎక్కువభాగం విదేశాల్లో జరపనున్నారు. ఇది విలన్ పాత్ర అని ఫిలింనగర్ టాక్. తాను విలన్ పాత్రలు చేయటానికి రెడీ అని రాజశేఖర్ గతంలోనే చెప్పారు. చూస్తుంటే ఇకపై రాజశేఖర్.. జగపతిబాబు రూట్ ని ఎన్నుకున్నాడా అని అనిపిస్తుంది కదా!