Advertisementt

తేజ అందుకే తప్పుకున్నాడా..?

Tue 01st May 2018 03:47 PM
teja,ntr biopic,nagarjuna,venkatesh  తేజ అందుకే తప్పుకున్నాడా..?
Nagarjuna Film With Director Teja తేజ అందుకే తప్పుకున్నాడా..?
Advertisement
Ads by CJ

సీనియర్ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'ఎన్టీఆర్' బయోపిక్. ఈ సినిమాను బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తూ.. నటిస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా సెట్స్ మీద వెళ్తుంది అనుకున్న టైంలో డైరెక్టర్ తేజ ఈ సినిమా నుండి తప్పుకున్నాడు.

తేజ అలా సడన్ గా తప్పుకోవడానికి కారణం బాలకృష్ణ తనకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వట్లేదని అందుకే ఆ సినిమా నుండి తప్పుకున్నట్టు తెలుస్తుంది. తేజ వెళ్ళిపోయాక ఆ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు అనుకున్న టైంలో తెర మీదకు పూరీ పేరు వచ్చింది. ఒకవేళ పూరీ కాకపోతే బాలకృష్ణ తానే స్వయంగా ఆ సినిమాను దర్శకత్వం చేయనున్నాడు.

అసలు విషయానికి వెళ్తే డైరెక్టర్ తేజ నాగార్జునకి ఓ కథ చెప్పిన్నట్టు తెలుస్తుంది. నాగార్జున కూడా తేజ చెప్పిన కథకు ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అంట. ప్రస్తుతం తేజ వెంకటేష్ తో ఓ మూవీ చేయనున్నాడు. ఈ సినిమా అయ్యిపోయాక నాగ్ తో సినిమా వుండే అవకాశం ఉంది. మరోపక్క నాగ్ సినిమా కోసమే తేజ 'ఎన్టీఆర్' బయోపిక్ నుండి తప్పుకున్నాడు అని వార్తలు వస్తున్నాయి. మరి ఏది నిజమో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Nagarjuna Film With Director Teja:

Teja Into Balayya Rival Camp

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ