Advertisementt

ఆకలితో వున్న పులి అల్లు అర్జున్: నాగబాబు!

Tue 01st May 2018 03:34 PM
naga babu,allu arjun,naa peru surya naa illu india  ఆకలితో వున్న పులి అల్లు అర్జున్: నాగబాబు!
Naga Babu Speech at Naa peru Surya Pre Release Event ఆకలితో వున్న పులి అల్లు అర్జున్: నాగబాబు!
Advertisement
Ads by CJ

'నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా' ప్రీరిలీజ్‌ వేడుకలో నిర్మాత నాగబాబు మాట్లాడుతూ, నిర్మాణం ఆపేద్దామని అనుకుంటున్నసమయంలో అల్లుఅరవింద్‌, ఈ చిత్రాన్ని నాకు, లడగపాటి శ్రీధర్‌లకి అప్పగించారు. ఇక సినిమాలు చేయలేను అని భావిస్తున్న సమయంలో నాకు మరలా అవకాశాన్ని ఉత్సాహాన్నిఅందించారు. అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్‌, చరణ్‌ అందరితో చిత్రాలు నిర్మించాను. కానీ ఎనర్జిటిక్‌ స్టార్‌ అయిన బన్నీతో చేయలేకపోయాను. అలా అనుకుంటున్న తరుణంలో ఈ చిత్రం రావడం నాకెంతో ఆనందాన్ని అందించింది. బన్నీ చాలా మంచోడు. ఆయన మంచి తనమే ఆయనకు రక్షణ ఇస్తుంది. 'రంగస్థలం'తో దుమ్మురేపిన రామ్‌చరణ్‌ ఈ వేడుకకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. బన్నీ కూడా చరణ్‌ లాగే దుమ్ము దులుపుతాడు. వక్కంతంవంశీ చాలా కాలంగా తెలుసు. కొత్త దర్శకుడే అయినా విజువల్స్‌ అద్భుతంగా తీశాడు. ఆయనకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో బన్నీ ఆకలిగొన్న పులిలా కనిపిస్తాడు. ఆయన ఎన్నో చిత్రాలు చేశారు. అయితే ఆయనకి ఈ మిలటరీ పాత్ర ఎంతో నప్పింది... అని అన్నారు.

Naga Babu Speech at Naa peru Surya Pre Release Event:

Naga Babu  Praises Allu Arjun at NSNI Event

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ