ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Allu Aravind Speech at Naa Peru Surya Pre Release Event

కుట్రలు చేస్తున్నారు: అల్లు అరవింద్!

Allu Aravind Speech at Naa Peru Surya Pre Release Event

నిన్న రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకున్న 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' సినిమా ఫంక్షన్ లో పాల్గొన్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, సినిమాపై కుట్ర జరుగుతోందని సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల తెలుగు ఇండస్ట్రీలో జరిగిన కొన్ని ఘటనలు మనసుకు బాధ కలిగించాయి. ఆ విషయాలపై కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు.

అంచేతనే ఈ సినిమాపై నెగటివ్ టాక్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని.. సినిమాకి మిక్స్డ్ టాక్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారని అని అన్నారు. వారి కుట్రలను మెగా అభిమానులు దాటుతారన్న నమ్మకం తనకుందని వ్యాఖ్యానించారు. మీరంతా తలచుకుంటే సినిమాపై జరుగుతున్న కుట్ర ఆపొచ్చని అయన చెప్పారు.

ఈ గొడవల్లో కనెక్ట్ కావద్దని బన్నీకి సూచించారు. ఈ సినిమా తప్పకుండ హిట్ అవుతుందని.. ఇంతకన్నా ఇప్పుడేమి మాట్లాడను అని సక్సెస్ మీట్ లో మాట్లాడతానని గర్వంగా చెప్పగలనని అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు.

Allu Aravind Sensational Comments at NSNI Event

allu aravind
naa peru surya naa illu india
media
bad talk
pre release event
fans