'రంగస్థలం' చిత్రంలో యంగ్ ఆంటీగా రంగమ్మత్తగా పల్లెటూరి పాత్రలో అనసూయ ఎంతగా ఒదిగిపోయిందో అందరికీ తెలుసు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే అనసూయ క్రేజ్ ప్రస్తుతం టాప్ హీరోయిన్స్‌తో సరిసమానంగా ఉంది. ఆమె సోషల్ మీడియాలో ఇచ్చే అప్‌డేట్స్ వైరల్ కావడం కామన్ అయిపోయింది. ఇక వృత్తిగత జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ కాస్త వివాదాస్పదరాలే అయినా ఆమెకున్న క్రేజ్‌ని మాత్రం ఎవ్వరూ కాదనలేరు. ఆమధ్య ఓ పిల్లాడి సెల్‌ఫోన్ విసిరేసి నేలకేసి కొట్టి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. దాంతో సోషల్ మీడియా నుంచి బయటికి వచ్చి మరలా రీఎంట్రీ ఇచ్చింది. ఇక ఈమె ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా ఈమె క్రేజే వేరు.
ఈమె తన నిజజీవితంలోని ప్రతి అప్‌డేట్‌ని కూడా తన ఫాలోయర్స్‌కి తెలుపుతూ ఉంటుంది. తాజాగా ఆమె సముద్రం తీరాన తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఫొటోలు దిగింది. ముఖ్యంగా సూర్యాస్తమయం సమయంలో ఆమె తన భర్తతో కలిసి తీసిన ఫొటో అయితే విపరీతమైన రొమాంటిక్‌గా ఉందని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇక ఈ ఫోటోలలో ఈమెని చూసి ఫిదా అవ్వని వారు ఉండరు. రోజూ టివిలో చూసే ఫేసే అయినా అందునా ఓ సపోర్టింగ్ నటి, ఐటం పాటల సుందరి, యాంకర్‌కి అంత ఫాలోయింగ్ రావడం నిజంగా ఆశ్చర్యకరమే.
ఇక ఈమె ట్విట్టర్‌లో షేర్ చేసిన ఫొటోలకి మరో యాంకర్, నటి, ఆమె స్నేహితురాలైన రష్మీ కూడా స్పందించింది. ఈ సందర్భంగా రష్మీకి అనసూయ బర్త్‌డే విషెష్‌ని తెలియజేసింది. దాంతో రష్మీ కూడా ఆమె సింగల్ ఫొటోని ట్విట్టర్‌లో పోస్ట్ చేసి థ్యాంక్స్ చెప్పింది. ఈ పిక్స్ మాత్రం బాగా వైరల్ అవుతున్నాయి. తన సృజనాత్మకతకు ఈ ఫొటోలు అద్దం పడుతున్నాయనే చెప్పాలి.