మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ఆలస్యంగా, నిదానంగా సినిమాలను తీస్తాడనే విమర్శ ఉంది. కానీ అందరు సహకరిస్తే ఆయన కూడా వేగంగా చిత్రాలను పూర్తి చేయగలడు. 'అజ్ఞాతవాసి' సమయంలో కేవలం పవన్ వల్లనే లేట్ అయింది. ఇక త్రివిక్రమ్ స్టోరీని సిద్దం చేసుకోవడానికి, ప్రీ ప్రొడక్షన్స్‌కి మాత్రం ఎక్కువ సమయం తీసుకుంటాడేగానీ ఒకసారి సినిమా షూటింగ్ మొదలు పెడితే శరవేగంగానే పూర్తి చేస్తాడు. ఇక ఈయన తదుపరి చిత్రం హారికా అండ్ హాసిని బేనర్‌లోనే రాధాకృష్ణ అలియాస్ చిన్నబాబు నిర్మిస్తున్నాడు.
'అజ్ఞాతవాసి'తో తనమీద వచ్చిన విమర్శలకు చెక్ పెట్టాలని త్రివిక్రమ్ పట్టుదలగా ఉండగా, 'జైలవకుశ' తర్వాత ఎంతో గ్యాప్ తీసుకుని మేకోవర్ అయిన ఎన్టీఆర్ కూడా ఈ చిత్రం ద్వారా పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్‌కి చేరువ కావాలని భావిస్తున్నాడు. ఇక ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌లో ఎన్నో యాక్షన్ సీన్స్‌ని, మేజర్ పార్ట్ షూటింగ్‌ను త్రివిక్రమ్ ఎన్టీఆర్‌లు వేగంగా పూర్తి చేశారు. రెండో షెడ్యూల్‌ని కూడా మే మొదటి వారంలోనే ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఇందులో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇక్కడ విషయం ఏమిటంటే కాస్త అటు ఇటు ఆలస్యమైనా ఫర్వాలేదు అనే పరిస్థితి ఎన్టీఆర్‌కి లేదు. ఎందుకంటే ఆయన అక్టోబర్ నుంచి రాజమౌళి,రామ్‌చరణ్‌ల మల్టీస్టార్ చిత్రంలో జాయిన్ కావాల్సివుంది. దాంతో త్రివిక్రమ్ కూడా దానికి తగ్గట్లే జెట్ స్పీడ్‌తో షూటింగ్ పూర్తి చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎలాగైనా అక్టోబర్‌లో దసరా కానుకగా సినిమాని విడుదల చేయాలని భావిస్తున్నారు.