Advertisementt

మీడియాపై బ్రహ్మానందం పంచ్..!

Mon 30th Apr 2018 03:25 PM
comedian brahmanandam,satires,media people,tirumala  మీడియాపై బ్రహ్మానందం పంచ్..!
Comedian Brahmanandam Satires on Media at Tirumala మీడియాపై బ్రహ్మానందం పంచ్..!
Advertisement
Ads by CJ

ఒకప్పుడు టాలీవుడ్ మొత్తాన్ని షేక్ చేసిన బ్రహ్మానందం ఈ మధ్య కాలంలో అయన సినిమాల్లో అంతగా కనిపించట్లేదు. లేటెస్ట్ గా బ్రహ్మానందం కీలక పాత్రలో నటించిన 'ఆచారి అమెరికా యాత్ర' సినిమా తాజాగా విడుదలయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా జనాలకి అంతగా ఎక్కట్లేదు. ప్రస్తుతం ఉన్న కమెడియన్స్ లో ఆ ప్లేస్ ను వెన్నెల కిషోర్ భర్తీ చేసాడు. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు బ్రహ్మానందం. దర్శనం అయ్యి బయటికి వస్తున్న టైంలో ఆయనతో మాట్లాడించడానికి మీడియా ప్రయత్నించగా అందుకు ఒప్పుకోలేదు.

బ్రహ్మానందం నడుచుకుంటూ వెళ్తుంటే విలేకరులు ఫొటోలు, వీడియోలు తీయడం కోసం ఆయన వైపునకు కెమెరాలు పెట్టి వెనకే నడుస్తూ వెళ్లారు. దీంతో బ్రహ్మానందం వారితో చమత్కారంగా 'ఇలా వెనక్కు వెనక్కు నడవడమే మీకు అలవాటైపోతుంది' అని అన్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో చోటు చేసుకున్న వివాదాలపై స్పందించాలని బ్రహ్మీని అడిగారు. పవన్ కళ్యాణ్ ఫిలిం ఛాంబర్ లో నిరసన తెలపడం.. శ్రీరెడ్డి పలువురిపై ఆరోపణలు చేయడం వంటి అంశాలపై విలేకరులు ఆయనను ప్రశ్నలు అడిగారు. కానీ ఆయన జోకులు వేస్తూ ముందుకు వెళ్లిపోయారు.

Comedian Brahmanandam Satires on Media at Tirumala:

Comedian Brahmanandam makes fun of media people and fans at Tirumala

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ