రెండు మూడు సినిమాలు హిట్ అయ్యాయో లేదో వెంటనే డిమాండ్లు.. రెమ్యూనరేషన్ పెంచేసింది హీరోయిన్ సాయి పల్లవి. తన పాత్ర నచ్చితేనే సినిమాలు చేస్తానని చెప్పి చాలా సినిమాలకు నో చెప్పింది. హీరో నాని.. నాగ శౌర్య ఆమెపై కంప్లైంట్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయ్. షూటింగ్స్ కి టైమ్ కి రాకపోవడం ఇలా చాలానే కంప్లయింట్స్ వచ్చాయి.
లేటెస్ట్ గా సాయి పల్లవి 'కణం' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొన్న శుక్రవారమే రిలీజ్ అయింది. ఈ సినిమాలో నాగశౌర్య హీరోగా నటించాడు. సాయి పల్లవితో జంటగా నటించిన నాగశౌర్య ఓపెన్ గా సాయి పల్లవిపై కంప్లయింట్ చేసి ఆ చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి కూడా రాలేదు. సాయి పల్లవి హీరో లేకపోతే నేను చేయలేనా అన్నట్టుగా ప్రొమోషన్స్ తెగ చేసేసింది.
అయితే ఏం లాభం ఎంత ప్రొమోషన్స్ చేసిన 'కణం'కి అసలు ఆకర్షణే రాలేదు. ఈ మూవీకి కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. కొన్ని చోట్ల ఈ సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్స్ రెంట్లు కూడా వసూలు కాలేదని ట్రేడ్ సమాచారం. నాగశౌర్య 'ఛలో' సినిమా హిట్ కొట్టిన ఉత్సాహంతో ప్రమోట్ చేస్తే సినిమాపై ఆసక్తి కలిగేదేమో. కానీ ఆలా జరగలేదు. సౌత్ లో హీరోయిన్స్ కి ఎక్కువ స్కోప్ వుండే కథలు తక్కువ. కనుక ఫలానా తరహా పాత్రలే చేస్తానంటూ కూర్చుంటే కణంలాంటి చిత్రాలే చేసుకోవాల్సి వస్తుంది. ఇవ్వన్నీ తెలుసుకుని సాయిపల్లవి కొంచెం తగ్గితే బాగుంటుంది అని సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయ్.