భరత్ అనే నేను సాధిస్తున్న విజయంతో మహేష్ ఎంతో ఆనందంగా ఉన్నాడు. ఇక తాజాగా ఆయన కేటీఆర్‌తో కలిసి 'విజన్ ఫర్ ఎ బెటర్ టుమారో' అనే ఇంటరాక్షన్‌లో పాల్గోన్నాడు. ఈ సందర్భంగా మహేష్‌బాబు మాట్లాడుతూ, నాకు రాజకీయాల మీద అవగాహన లేదు. కానీ కొరటాలశివకి ఎంతో రాజకీయ పరిజ్జానం ఉంది. ఆయన భవిష్యత్తులో నేను కూడా ఎమ్మెల్యేని కావాలని ఉందని ఓ సారి నాతో చెప్పాడు.. అన్నాడు. దానికి కేటీఆర్ 'ఎమ్మెల్యే' అంటే 'మంచి లక్షణాలు ఉన్న అబ్బాయే' కదా అనడంతో నవ్వులు విరబూశాయి.
ఈ చిత్రం కథ నాకు కొరటాల చెప్పినప్పుడు నాకు రాజకీయాలపై అవగాహన లేదు. ఏం చేద్దాం అని నేను కొరటాలశివను అడిగాను. ఆయన సింపుల్‌గా బయట కేటీఆర్ ఎలా ప్రవర్తిస్తాడో చూడండి. అలా చేస్తే చాలు అని సలహా ఇచ్చారు. ఈ సినిమాలో భాగస్వామిని అయినందుకు ఎంతో ఆనందంగా ఉంది. నేను ఈ చిత్రం కోసం ఒకటిన్నర సంవత్సరం కష్టపడ్డాను. కానీ కేటీఆర్ గారు రోజు అంతటి కష్టం పడుతూనే ఉంటారని, ఈ చిత్రం చేసిన తర్వాత నాకు అర్ధమైంది. అందుకే ఆయనతో హాలీడేస్‌కి వెళ్లాలని ఉంది. ఇక ఈ చిత్రంలో మేము చేనేత దుస్తులనే ధరించాం. అవి ఎంతో కంఫర్టబుల్‌గా, చూసేందుకు ఎంతో స్టైలిష్‌గా, ముఖ్యంగా నాకు అవి కొత్త లుక్‌ని తెచ్చిపెట్టాయి. ఇక నుంచి చేనేత వస్త్రాలను ప్రమోట్ చేస్తామని మహేష్ చెప్పడంతో కేటీఆర్ థ్యాంక్స్ చెప్పారు.
ఇక కేటీఆర్ మాట్లాడుతూ.. మహేష్ యువతకే కాదు అందరికీ స్ఫూర్తి. ఎందుకంటే ఆయన చిన్ననాటి నుంచే ఓ సూపర్‌స్టార్. ఎంతో క్రమశిక్షణతో ఎదిగారు. ఇంత విజయం అందుకున్న మహేష్‌కి అభినందనలు. ఇదివరకు 100రోజులు, 200రోజులు అని ఉండేది. ఇప్పుడు అవి వందకోట్లు, రెండోందలకోట్లుగా మారాయి. ఈ చిత్రం మరింతగా విజయాన్ని కలెక్షన్లను తేవాలి. అంతేకాదు మహేష్ ఎప్పుడు ఇలా విజయాలతోనే ఉండాలి. ఈ చిత్రంలో రెండు మూడు అంశాలు నాకు బాగా నచ్చాయి. ఒకవైపు సందేశం, మరోవైపు సక్సెస్ కావాలంటే సినిమాలో ఖచ్చితంగా నాటకీయత ఉండాలి. దాన్ని ఆచరించిన దర్శకుడు ఇంతటి విజయం సాధించడం ఆనందంగా ఉంది.
ఇక ఇందులో మహేష్ సీఎం అయిన వెంటనే ట్రాఫిక్‌పై ఓ నిర్ణయం తీసుకుంటాడు. అదే నేను నిజజీవితంలో చేస్తే జనాలకు నచ్చదు. పేకాటను బ్యాన్ చేశాం. అయినా ఇంటర్నెట్‌లో రమ్మీ ఆడుతున్నారు. దానిని కూడా నిషేధం విధించాలని చూశాం. కానీ ప్రజల సహకారం కావాలి. ఇలాంటి మంచి పనులు చేసినా కూడా ప్రజాస్వామ్యంలో ఇది ఏంది అంటారు తప్ప మంచిని ప్రోత్సహించరు అని కేటీఆర్ అనగానే నిజమే సార్.. క్రికెట్ బెట్టింగ్‌లు కూడా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. తరువాతి బాల్ నోబాల్, వైడ్ అని కూడా పందేలు కాస్తున్నారని మహేష్ కేటీఆర్ దృష్టికి తెచ్చాడు.