వీరిని సెలబ్రిటీలుగా తయారు చేయడానికి మీడియా కావాలి. చానెల్స్ కావాలి. అన్నిరకాలుగా కవరేజ్‌లు చేసేందుకు మీడియా అవసరం వీరికి మొదట్లో భలే ఉంటుంది. నాడు మాత్రం మీడియా సోదరులు, మీడియా ప్రతినిధులకు నమస్కారం, మీరు లేకుంటే మేము లేమని చెబుతారు. ఆ తర్వాత ప్రేక్షకులే మా దేవుళ్లు అంటారు. కానీ కాస్త సెలబ్రిటీ వచ్చిన తర్వాత మాపైనే వార్తలు రాస్తారా? అని మండిపడతారు. సెలబ్రిటీలన్న తర్వాత సహజంగానే మీడియా ఫోకస్ వారి మీద ఉంటుంది. పలువురు వారు మాట్లాడే మాటలను వినడానికి, వారు చేసే చేష్టలను చూడటానికి ఉత్సాహం చూపుతారు. పోనీ మీడియానే కావాలని గొడవ క్రియేట్‌చేస్తుందా? అంటే లేదు. తామేదో మానవాతీతులైనట్లు వారు భావిస్తూ ఉంటారు.
ఇక విషయానికి వస్తే తాజాగా జబర్ధన్త్ ఫేమ్ షేకింగ్‌శేషు తన స్నేహితులతో కలిసి వైజాగ్ రైల్వే స్టేషన్‌లో టిసితో తగవు పెట్టుకున్నారు. తాము సెలబ్రిటీలమని, తమను ఏమైనా అంటే ఊరుకోమని వారు టిసిని బెదిరించినట్లు సాక్ష్యులు, తోటి ప్రయాణీకులు చెబుతున్నారు. ఇక హౌరా నుంచి హైదరాబాద్ వెళ్లే ఈస్ట్‌కోస్ట్ ఎక్క్‌ప్రెస్‌లో షేకింగ్ శేషు, ఆయన స్నేహితులు విశాఖ నుంచి హైదరాబాద్ వరకు ఏసీ కంపార్టెమెంట్‌లో టిక్కెట్స్ బుక్ చేసుకున్నారు. కానీ వారు విజయనగరంలోనే జనరల్ టిక్కెట్‌తో ఏసీబోగీలోకి ఎక్కి వైజాగ్ నుంచి తమకు ఏసీ టిక్కెట్స్ ఉన్నాయని చెప్పినా ఆ టిసి నో అన్నాడు. ఇక తాము ఫైన్ కూడా కట్టమని, తప్పు టిసిది అయినప్పుడు తామెందుకు ఫైన్ కట్టాలని శేషు వాధిస్తున్నాడు.
ఈ సంఘటనలు మొత్తాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి పంపితే దానిని మీడియాపెద్ద రచ్చ చేసిందని, రెండు తెలుగు రాష్ట్రాలలో సెలబ్రిటీలను, కళాకారులను బతకనివ్వరా? అని శేషు ప్రశ్నించడం చూస్తే తప్పు చేయనేలా? దానిని చూపిస్తే నానా హంగామా చేయడం ఏలా? అనిపించకమానదు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం తప్పంతా షేకింగ్ శేషు, అతని స్నేహితుల ఓవర్‌యాక్షన్ వల్లే జరిగిందని తెలుస్తోంది.