Advertisementt

హీరోయిన్‌కి మద్దతు పలికాడు!

Sun 29th Apr 2018 03:54 PM
abhishek bachchan,athiya shetty,trolls,netizen  హీరోయిన్‌కి మద్దతు పలికాడు!
Abhishek Bachchan Supports To Actress Athiya Shetty హీరోయిన్‌కి మద్దతు పలికాడు!
Advertisement
Ads by CJ

బహుశా మనుషుల ఆకారాలు, వారి రంగు, ఎత్తు, పొడవు. లావు, సన్నం, వారిలోపాలను కూడా టీజ్‌ చేస్తూ హాస్యాన్ని సృష్టించే సంస్కృతి ఎక్కువగా మనదేశ సినీరంగంలోనే కనిపిస్తుంది. ఇక ఇప్పుడు సోషల్‌ మీడియా బాగా విస్తృతం కావడంతో పలువురు సెలబ్రిటీల మరీ ముఖ్యంగా నటీమణుల డ్రస్సింగ్‌, వారి బాడీషేప్‌లపై నెటిజన్లు ఘోరంగా విమర్శలు సంధిస్తున్నారు. తాజాగా ఓ స్టార్‌ కూతురికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. అయితే ఆమెకి ఈ విషయంలో బాలీవుడ్‌ బాద్‌షా, మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కుమారుడు స్టార్‌ అభిషేక్‌బచ్చన్‌ అండగా నిలిచాడు. 

గతంలో కూడా విద్యాబాలన్‌ డ్రస్సింగ్‌, బాడీషేప్‌లపై ఓ విలేకరి ప్రశ్నలు అడిగితే ఈమె ఆ ప్రశ్నను అడిగిన విలేకరిపై మైండ్‌సెట్‌ మార్చుకోమని మండిపడింది. ఇక తాజాగా కూడా బాడీ షేమింగ్‌లపై సోనమ్‌కపూర్‌, సోనాక్షి సిన్హా, ఇలియానా, ఐశ్వర్యారాయ్‌ వంటివారు తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో మీడియా, నెటిజన్ల విమర్శలపై ఘాటుగా స్పందిస్తున్నారు. ఇలాంటివి చేయవద్దని వార్నింగ్‌లు ఇస్తున్నారు. అసలు తమ బాడీషేప్‌లతో మీకెందుకు?నచ్చితే చూడండి లేకపోతే లేదు. మా వ్యక్తిగత అభిరుచుల మేరకు మేము ఉంటాం. ఇందులో మీ జోక్యం ఏమిటి? అని మండిపడుతున్నారు. 

తాజాగా బాలీవుడ్‌ సీనియర్‌ స్టార్‌ సునీల్‌శెట్టి కుమార్తె నటి అతియాశెట్టి లావుగా ఉందని, కాస్త తిండి తగ్గించాలంటూ కొందరు నెటిజన్లు కామెంట్‌ చేశారు. ఆమె ఎక్కువ తింటేనే బాగుంటుందని మరికొందరు కామెంట్స్‌ చేశారు. దీనిపై అతియా స్పందిస్తూ 'కొందరుసన్నగా ఉండవచ్చు. కొందరు లావుగా ఉండవచ్చు.ఎక్కువ తినాలో, తక్కువ తినాలో చెప్పడం తప్పు. ఎవరి పోరాటం వారిది. బాడీషేమింగ్‌ కామెంట్స్‌ చేయడం మంచిపద్దతి కాదు. ఇతరుల పట్ల దయగా ఉండాలి. వాటిని మానివేయాలని ఆమెకోరింది. అతియా వ్యాఖ్యలకు అభిషేక్‌బచ్చన్‌ మద్దతు తెలిపాడు. ఇలాంటి విషయాలు ఏమాత్రం పట్టించుకోవద్దు. వెళ్లి ఓ డోనట్‌ తిను..అంటూ రీట్వీట్‌ చేశాడు. 

అతియా, అభిషేక్‌ల ట్వీట్టకు మంచి స్పందన లభిస్తోంది. ఇతరుల శరీరతత్వాన్ని అంగీకరించాలే తప్ప, విమర్శించడం మంచిదికాదని పలువురు అంటున్నారు. ఏదైనాలోపం కనిపిస్తే నీ భవిష్యత్తుకి ఇది మంచిదికాదు అనే సలహాను ఇవ్వాలే గానీ ఇలా విమర్శలు చేయడం మాత్రం తప్పు అనే చెప్పాలి. 

Abhishek Bachchan Supports To Actress Athiya Shetty:

Abhishek Bachchan Defends Athiya Shetty Against Trolls

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ