Advertisementt

సమంత.. 'స్వర్గంలోకి అడుగు పెట్టిందట'!

Sun 29th Apr 2018 03:46 PM
samantha,naga chaitanya,birthday,u turn  సమంత.. 'స్వర్గంలోకి అడుగు పెట్టిందట'!
Samantha Birthday Special సమంత.. 'స్వర్గంలోకి అడుగు పెట్టిందట'!
Advertisement
Ads by CJ

ఈమె టాలీవుడ్‌ టాప్‌ బ్యూటీ..అక్కినేనికోడలు...నాగచైతన్య శ్రీమతి... అభిమానుల కలలరాణి.. ఇలా సమంత గురించి ఎంతైనా చెప్పవచ్చు. పాతకాలంలో లాగా నేటితరంలో కూడా పెళ్లి తర్వాత కూడా నటిగా విజయం సాధించవచ్చని ఈమె రాజుగారిగది2, మరీ ముఖ్యంగా రంగస్థలంతో నిరూపించింది. ఈమె విశాల్‌తో కలిసి నటిస్తున్న 'ఇరంబుదరై' చిత్రం మే 11న తెలుగులో 'అభిమన్యుడు' పేరుతో విడుదల కానుంది. దానికి రెండు రోజుల ముందు అంటే మే 9వ తేదీన ఆమె జర్నలిస్ట్‌ మధురవాణిగా నటించిన 'మహానటి' చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. ఇందులో సమంత సరసన విజయ్‌దేవరకొండ నటిస్తున్నాడు. ఇక ఈమె ఈరోజుతో 31 వసంతాలను పూర్తి చేసుకుంది. 

ఇక తన బర్త్‌డే వేడుకలకు అభిమానులు, అక్కినేని ఫ్యామిలీ అభిమానులు, అత్తింటివారు, పుట్టింటి వాళ్లు గ్రాండ్‌గా చేయడం మామూలే. అవ్వన్నీ ఒకేరోజు జరిపే అవకాశం లేకపోవడంతో ఈమె రెండు రోజుల ముందు నుంచే తనబర్త్‌డే వేడుకను జరుపుకుంది. ముందుగా ఆమె అభిమానుల సమక్షంలో కేక్‌ని కట్‌ చేసి సంబరాలు ప్రారంభించింది. ఇక పుట్టినరోజు నాడు ఆమె నటిస్తున్న 'యూటర్న్‌' సెట్స్‌కి వెళ్లే అవకాశం లేకపోవడంతోవారితో కూడా ఈ వేడుకను ఒకరోజు ముందే  కేక్‌ కట్‌ చేసి జరుపుకుంది. 

ఇక తన బర్త్‌డే రోజున ఆమె తన భర్త నాగచైతన్యతో కలిసి హిమాలయాలకు వెకేషన్‌గా వెళ్లి అక్కడి అందమైన ప్రకృతి దృశ్యాలను చూస్తూ తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలిపినసామ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా హోటల్‌ రూం నుంచి తాను తీసిన ఫొటోను పోస్ట్‌ చేసింది. 'స్వర్గంలోకి అడుగుపెట్టాను' అని ట్వీట్‌ చేసింది. ఇక ఈమె అక్కినేని వారికోడలు అయిన తర్వాత జరుపుకుంటున్న మొదటి బర్త్‌డే వేడుక కావడంతో దీనిని ఆమె తన భర్తతో కలసి బాగా సెలబ్రేట్‌ చేసుకుంటోంది. 

Samantha Birthday Special:

>Samantha Akkineni rings in her birthday with hubby Naga Chaitanya in Kashmir

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ