దర్శకుడిగా నాలుగే నాలుగు సినిమాలు తీశాడాయన. తీసిన నాలుగు సినిమాలు సూపర్ హిట్స్. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు కొరటాల శివ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా టాప్ లో కొచ్చేసాడు. ఆయన తెరకెక్కించిన భరత్ అనే నేను భారీ వసూళ్లు రాబడుతుంది. మహేష్ తో రెండు సినిమాలు చేసిన కొరటాలకు రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ హిట్ అవడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. భరత్ అనే నేను ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.
అయితే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మారిన కొరటాల శివ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తున్నాడో అనేది ప్రస్తుతానికి స్పష్టత లేదు. కొరటాల మాత్రం రామ్ చరణ్ తో అన్నాడు కానీ... అది ఇప్పట్లో సాధ్యమయ్యే సూచనలు కనబడడం లేదు. అయితే ఇప్పుడు కొరటాల మీద ఒక హాట్ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేమిటంటే.. ప్రస్తుతం దర్శకుడిగా ఉన్న కొరటాల త్వరలోనే నిర్మాతగా మారబోతున్నాడు అని. అందులో భాగంగానే కొరటాల ఓన్ గా ఒక బ్యానర్ స్థాపించబోతున్నాడని కూడా ఫిలింనగర్ టాక్. అయితే కొరటాల ఈ డెసిషన్ ని ఎందుకు తీసుకున్నాడో కూడా కారణాలు చెబుతున్నారు.
ప్రస్తుతం చేతిలో చాలా కథలున్నప్పటికీ... ఆయన డైరెక్ట్ చేసేందుకు స్టార్ హీరో దొరకకపోవడం వలన కొరటాల ప్రస్తుతం డైరెక్షన్ మీద నుండి నిర్మాత అయ్యే విధంగా ఆలోచిస్తున్నాడట. అందుకే తానే ఒక మంచి కథని ఎంచుకుని ఒక యంగ్ డైరెక్టర్ తో సినిమా చెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్లుగా ప్రచారం మొదలైంది. మరి ఈ ప్రచారం నిజమో లేదంటే... కొరటాల నెక్స్ట్ హీరో అల్లు అర్జున్ అంటూ జరిగే ప్రచారం నిజమో అనేది క్లారిటీ రావాల్సి ఉంది.