Advertisementt

కీర్తి సురేష్ ని ఆ మహానటే కరుణించాలి!

Sat 28th Apr 2018 03:53 PM
mahanati,savitri,keerthi suresh,biopic,agnathavasie  కీర్తి సురేష్ ని ఆ మహానటే కరుణించాలి!
Keerthy Suresh Big Hopes on Mahanati Savitri Biopic కీర్తి సురేష్ ని ఆ మహానటే కరుణించాలి!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో కీర్తి సురేష్ టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పుతుంది అనుకుంటే... ఆమె హవా అజ్ఞాతవాసి సినిమాతోనే వెళ్ళిపోయింది. అజ్ఞాతవాసి సినిమా అప్పుడు బాగా బొద్దుగా కనబడిన కీర్తి సురేష్ కి తెలుగులో అవకాశాలే లేకుండా పోయాయి. పవన్ కళ్యాణ్ సినిమా అనగానే... ఎగిరిగంతేసి ఒప్పేసుకుంది కీర్తి సురేష్. అసలు ఆ సినిమాలో తన పాత్రకి ఎంత ఇంపార్టెన్స్ వుందో కూడా అమ్మడుకు ముందు తెలియలేదనుకుంటా.. సినిమా విడుదలయ్యాక మాత్రం కీర్తికి అర్ధమయ్యేకన్నా ప్రేక్షకులకు బాగా అర్ధమయ్యింది. అయితే ప్రస్తుతం కీర్తి సురేష్ మహానటి సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులను మే 9 న హోల్సేల్ గా పలకరించబోతుంది.

మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అద్భుతంగా కనబడుతుంది. కీర్తి లుక్స్, ఆమె మేకప్ ఇవన్నీ అచ్చం సావిత్రి పోలికలతో ఉన్న చిన్న సావిత్రి అన్నట్టుగా వుంది కీర్తి సురేష్ మహానటి సినిమాలో. ఇప్పటికే విడుదలైన మహానటి సావిత్రి పోస్టర్స్ లో కీర్తి సురేష్ అదరగొట్టేస్తుంది. ఇక కోలీవుడ్ లో ఒకటి అరా సినిమా చేస్తున్న కీర్తి సురేష్ కి మళ్ళీ మహానటి తరవాత ఎమన్నా వస్తే అవకాశాలు రావొచ్చు. అయితే కీర్తి సురేష్ అజ్ఞాతవాసి టైం లో బాగా బరువు పెరిగి ఎబ్బెట్టుగా కనబడింది. కీర్తి అలా బరువు పెరగడానికి మహానటి సినిమానే కారణం. సావిత్రి కూడా బొద్దుగా లావుగా ఉన్నప్పటికీ తన నటనతో, హావభావాల తోనే సావిత్రి అద్భుతంగా సినిమాల్లో క్లిక్ అయ్యింది.

మహానటిలో సావిత్రి పాత్రకి కూడా కీర్తి బరువు పెరగాల్సి రావడంతోనే అజ్ఞాతవాసి ఫంక్షన్స్ లో ఆమె అలా బబ్లీగా కనిపించడానికి కారణమయ్యింది. కానీ అలా బబ్లీగా ఉండేసరికి కీర్తి సురేష్ కి ఉన్న అవకాశాలు చేజారిపోయాయి. మరి మహానటిలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ రెచ్చిపోయి నటిస్తేనే ఆమెకి మళ్ళీ అవకాశాలు రావడము.. హీరోయిన్ గా కొంతకాలం ఇండస్ట్రీలో నిలబడడము జరుగుద్ది. లేదంటే... అంతే సంగతులు.  

Keerthy Suresh Big Hopes on Mahanati Savitri Biopic:

Keerthy Suresh Turned Into Mahanati Savitri

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ