నిజానికి బాలయ్య ఎంత మూడీ ఫెల్లోనో తేజ అతనికంటే రెండు ఆకులే ఎక్కువ చదివాడు. ఇక బాలయ్య గతంలో ఎన్నడు సినిమా కథ విన్న తర్వాత ఏ విషయంలోనూ వేలుపెట్టిన చరిత్రలేదు. ఆయన దర్శకులకు అంతగా విలువనిస్తాడు. ఇక తేజ విషయానికి వస్తే ఆయన తనమాట మాత్రమే నెగ్గాలని భావించేతత్వం. దర్శకుని విషయంలో వేలు పెడితే ఆయన ఒప్పుకోడు. 'నేనే రాజు నేనేమంత్రి' చిత్రాన్నిపూర్తిగా రాజశేఖర్‌తో తెరకెక్కించిన తర్వాత కూడా కేవలం క్లైమాక్స్ విషయంలో తేజకి, రాజశేఖర్‌కి స్పర్ధలు వస్తే, అప్పటివరకు తీసిన చిత్రాన్నికూడా పక్కన పెట్టేసి మరలా ప్రెష్‌గా దగ్గుబాటి రానాతో తీశాడు. ఈ చిత్రం విషయంలోకూడా సురేష్‌బాబు, రానాలు జోక్యం చేసుకోకూడదని ఆయన కండీషన్‌పెట్టాడు.ఇ
క ఈ వ్యవహారం ఇలా ఉంటే ఎప్పుడు సినిమాలలో వేలు పెట్టని బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ ఎలా ఉండాలి? ఎవరిని పెట్టుకోవాలి? నుంచి స్క్రిప్ట్ తయారు చేసే వరకు తన కనుసన్నలలోనే జరిగేలా చూశాడు. దాంతో తేజ ఈ చిత్రం నుంచి బయటికి వచ్చాడని, కేవలం బాలయ్యతో క్రియేటివ్ డిఫరెన్స్‌లే దీనికి కారణమని అనుకుంటున్నారు. ఇక తేజ తాను చిత్రానికి న్యాయం చేయలేనని బయటికివచ్చాడని చెబుతున్నా, ఆయనబాలయ్య భావాలతో ఏకీభవించలేదని, స్వతహాగా హిట్‌ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ఎలాంటి సబ్జెక్ట్‌నైనా హ్యాండిల్ చేయగలననే ఆత్మవిశ్వాసం తేజలో ఎక్కువ కాబట్టి ఆయన న్యాయం చేయలేనని భావించాడని చెప్పడం ఆయన్ను దగ్గరగా చూసినవారికి నమ్మశక్యం కావడంలేదు.
ఇక ఈయన గతంలో నితిన్ 'ధైర్యం' చిత్రం విషయంలో కూడా నిర్మాతగా వ్యవహరించిన నితిన్ తండ్రితో తగవు పెట్టుకుని తన పేరు కూడా వాడుకోవడానికి వీలులేదని తేల్చిచెప్పాడు. ఇక తేజ ఎన్టీఆర్ చిత్రం కోసమని వెంకటేష్ చిత్రాన్ని కూడా పక్కనపెట్టాడు. ఇప్పుడు రెండు చిత్రాల అవకాశాలను ఆయనకు దూరం అయ్యాయి. దీంతో తేజ నెక్ట్స్ ఏంటి? అనేది పలు చర్చలకు దారి తీస్తుండగా, ఇక బాలయ్య తన తండ్రి బయోపిక్ ఎన్టీఆర్‌ని సింగీతం శ్రీనివాసరావు, లేదా రాఘవేంద్రరావుల పర్యవేక్షణలో బాలయ్యే దర్శకత్వం వహిస్తాడని కూడా వార్తలు వస్తున్నాయి.
ఈయన గతంలో 'నర్తనశాల' అనే చిత్రాన్ని తన స్వీయ దర్శకత్వంలో మొదలుపెట్టినా కూడా ద్రౌపది పాత్రను పోషించాల్సిన సౌందర్య మరణంతో ఆయన ఆ ప్రాజెక్ట్ వాయిదా వేశాడు. ఇక మరోవైపు బాలయ్య ఈ చిత్రాన్ని తన వందో చిత్రం 'గౌతమీ పుత్రశాతకర్ణి'కి దర్శకత్వం వహించిన క్రిష్ చేతిలో పెట్టనున్నాడని, మరి కొన్నిరోజుల్లో ఆయన 'మణికర్ణిక' నుంచి ఫ్రీ కావడం వల్ల ఆయన ఈ చిత్రం బాధ్యతలు ఆయన చేతికి గానీ రాఘవేంద్రరావుకి గానీ ఇవ్వాలని భావిస్తున్నాడట బాలయ్య. మరి రాఘవేంద్రరావు వంటి వారికి మాత్రం ఒకరు ప్రారంభించిన పనిలో మద్యలో చేరే అలవాటు లేదు.
ఇక వీరితో పాటు గతంలో ఎన్టీఆర్ వీరాభిమానిగా, తన చిత్రాలన్నీ 'ఒక్క మగాడు' వరకు అన్ని నందమూరి హీరోలతోనే సినిమాలు చేసి, తర్వాత మాత్రం సాయిధరమ్‌తేజ్‌ని పరిచయం చేసిన ఎన్టీఆర్ వీరాభిమాని, బొమ్మరిల్లు సంస్థ అధినేత వైవిఎస్ చౌదరి పేరు కూడా ఇందులో వినిపిస్తోంది. ఎందుకంటే బాలయ్య కంటే వైవిఎస్‌చౌదరి, కొమ్మినేని వెంకటేశ్వరరావులకు ఎన్టీఆర్ గురించి బాగా తెలుసు. మరోవైపు బాలయ్య మదిలో పూరీజగన్నాథ్, కృష్ణవంశీ, తమిళ దర్శకుడు తనతో 'మహారధి' చేసిన నాటి ఎన్టీఆర్ పర్సనల్ మేకప్‌మేన్ పీతాంబరం కుమారుడైన పి.వాసు పేరు కూడా వినిపిస్తోంది. మరి వీటన్నింటిలో బాలయ్య ఏ వైపు మొగ్గుచూపుతాడు అనేది సస్పెన్స్‌గా మారింది.