రామ్ చరణ్ ఈ ఏడాది రంగస్థలం చిత్రంతో అదిరిపోయే... కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. తన రెండో సినిమా మగధీర చిత్ర రికార్డులను తానే రంగస్థలం చిత్రంతో తిరగరాసుకున్నాడు. రంగస్థలంలో చిట్టిబాబుగా రామ్ చరణ్ నటన పది కాలాలు గుర్తుండిపోయేలా ఉంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమా కలెక్షన్స్ అప్పుడే 200 కోట్లు దాటేశాయని ట్రేడ్ వర్గాల చెబుతున్నమాట. మరీ రామ్ చరణ్ రంగస్థలం విడుదలకు ముందునుండే... ఈ చిత్రానికి భీభత్సమైన ప్రమోషన్ చేసాడు. చిత్ర బృందం అంతా ప్రమోషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్లాయి. అయితే గత వారం మహేష్.. భరత్ అనే నేను విడుదలతో రంగస్థలం కలెక్షన్స్ కి డల్ అయ్యాయి.
ప్రస్తుతం రామ్ చరణ్, బోయపాటి సినిమాతో బిజీగా వున్నాడు. అయితే రామ్ చరణ్ రంగస్థలం సినిమా ప్రమోషన్స్ తో పాటుగా నిస్సహాయులకు సహాయసహకారాలు కూడా అందిస్తున్నాడు. అది కూడా మంచు లక్ష్మి నిర్వహిస్తున్న మేము సైతం కార్యక్రమం ద్వారా రామ్ చరణ్ ఒక నిరుపేద కుటుంబానికి సహాయం చేసాడు. మేము సైతం సీజన్ 2 లో రామ్ చరణ్ ఐస్‌క్రీములు, సోడాలు కూడా అమ్మాడు. హైదరాబాద్ నడిబొడ్డున సారథి స్టూడియో వద్ద రామ్ చరణ్ మేము సైతం కార్యక్రమంలో భాగంగా ఇలా సోడాలు, ఐస్ క్రీములు అమ్ముతూ వచ్చిన డబ్బుతో.. ఆ నిరుపేద కుటుంబానికి సహాయం చెయ్యడానికి రెడీ అయ్యాడు.
అయితే అక్కడ సోడాలు అమ్మే దగ్గర చిన్నారులతో ఫోటోలు దిగుతూ చరణ్ హుషారుగా కనిపించాడు. ఇప్పుడు చరణ్ అక్కడ ఐస్ క్రీములు అమ్మే ఫొటోస్ సోషల్ ఇండియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరీ రామ్ చరణ్ మేము సైతం ప్రోగ్రాం కోసం చేసిన ఈ కార్యక్రమ త్వరలోనే జెమిని టీవీ లో ప్రసారం కానుంది.