ఒకవైపు విడుదలై ఇన్నిరోజులైనా 'రంగస్థలం' చిత్రం ఇంకా స్టడీగా కలెక్షన్లు సాధిస్తూనే ఉంది. ఇక తాజాగా విడుదలైన 'భరత్‌్ అనే నేను' చిత్రానికి కూడా కేటీఆర్ నుంచి రాజమౌళి, రామ్‌చరణ్ , ఎన్టీఆర్ వంటి వారు పొగడ్తలతో ముంచేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం చూసిన సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేష్ కూడా 'భరత్ అనే నేను'పై పొగడ్తల వర్షం కురిపించాడు. సోషల్ మీడియాలో వెంకటేష్ సాధారణంగా యాక్టివ్‌గా ఉండడు. కానీ 'భరత్'ని చూసిన తర్వాత ఆయన పొగడ్తలు కురిపించలేకుండా ఉండలేకపోయాడు. ఆయన ట్వీట్ చేస్తూ 'భరత్ అనే నేను' చిత్రం చూశాను, మహేష్‌బాబు అద్భుతంగా చేశాడు. దర్శకుడు కొరటాల శివ సెన్సిబుల్ విషయాన్ని ఎంతో అందంగా తెరకెక్కించాడని తెలిపాడు. ఇక ఈచిత్రాన్ని నిర్మించిన దానయ్యపై కూడా ప్రశంసలు కురిపించాడు. దానయ్యతో పాటు టీం మొత్తానికి శుభాకాంక్షలు తెలిపాడు.
ఇక ఈ చిత్రం గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, ఈ సినిమాలో హీరో ఒకచోట 'ప్రామిస్' అన్నాడు. కానీ నాకు మాత్రం ఆ డైలాగ్ కొరటాల శివ చెప్పినట్లుగానే వినిపించింది. మీకు ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు. మంచి రాజకీయం ఎలా ఉండాలి? అనే పాయింట్‌ని సినిమా టిక్‌గా కాకుండా జనాలు ఏది భావిస్తున్నారో? ఆ భావనతోనే సినిమా తీస్తాను అని కొరటాల ప్రామిస్ చేశాడనే విధంగా ఇది ఉంది. శ్రీమంతుడులా కాకుండా భరత్ అనే నేను లో ఓపెనింగ్ షాట్‌తోనే కొరటాల శివ డైరెక్ట్‌గా అసలు కథలోకి తీసుకెళ్లడం కొరటాల గొప్పతనం.
ఈ చిత్రంలోని కొన్ని విశేషాలను తెలియజేస్తూ పరుచూరి కొరటాల ఆలోచనా విధానాన్ని మెచ్చుకున్నాడు. ఈ చిత్రం చూస్తే భరత్ చిత్రాన్ని ఆయన కమర్షియల్‌గా తీయలేదని అర్దమవుతుంది. దీనిని 'జాతర' సన్నివేశం విషయంలో ఈజీగా కనిపెట్టవచ్చు. సాధారణంగా జాతర సీన్ వచ్చిందంటే మనదర్శకులు అబ్బా మంచిచాన్స్‌వచ్చిందని భావించి, ఐటం సాంగ్ పెట్టేస్తారు. అలా పెట్టుకునే అవకాశం ఉన్నా కూడా ఆ ఐటం సాంగ్‌తో ఇరగదీసే చాన్స్ ఉన్నా కొరటాల అలాచేయలేదు. ఆడియన్స్ మూడ్‌ని ఆయన డిస్టర్బ్ చేయలేదు. అదే కరెక్ట్. నిజంగా ఎంతో నిజాయితీగా కొరటాల శివ ఈ చిత్రాన్ని తీశాడని ఆయన వివరించారు.