సౌతిండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రంలో నటించే అవకాశం రావడం అంటే ఎవరికైనా ఆనందంతో పాటు భయం కూడా వేస్తుంది. ఆయన నటించిన 'శివాజీ' చిత్రంలో సుమన్ ఆ ధైర్యం చేశాడు. ఇక ప్రస్తుతం ఆయన నటించిన 'కాలా' చిత్రంలో దేశం గర్వించదగ్గ నటుడు నానా పాటేకర్ విలన్ పాత్రను పోషిస్తున్నాడు. ఇక '2.0'లో బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ విలన్ పాత్రను చేస్తున్నాడు. 'కాలా' చిత్రంను పలు సార్లు వాయిదా వేయడం వల్ల ఈ చిత్రానికి హైప్‌రాలేదని కొందరు భావిస్తున్నారు. కానీ 'కాలా' చిత్రం కేవలం అన్ని భాషల శాటిలైట్ హక్కులే 75 కోట్లకు పైగా జరిగిందని పూర్తి బిజినెస్ 200 కోట్లు దాటిందని సమాచారం. ఈ చిత్రాన్ని వండర్ బార్‌్ పతాకంపై రజనీ అల్లుడు, స్టార్ హీరో ధనుష్ నిర్మిస్తుండటం విశేషం.
ఈ చిత్రం జూన్ 7 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక రజనీ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి ఆయన ఇక చేయబోయే చివరి చిత్రంపై అందరిలో ఆసక్తిరేపుతోంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుండగా, 'పిజ్జా, జిగర్ తాండ, ఇరైవి' వంటి చిత్రాల ద్వారా విలక్షణ దర్శకునిగా పేరు తెచ్చుకున్న కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళడానికి సిద్దమైన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ సీజన్‌లో విడుదల చేయాలని భావిస్తున్నాడు. ఇక ఈ చిత్రం కథ కూడా పొలిటికల్ టచ్‌లోనే సాగనుందని సమాచారం.
మరోవైపు తమిళ ఇండస్ట్రీలోకి విలన్‌గా ఎంట్రీ ఇచ్చి, కార్తీక్ సుబ్బరాజు 'పిజ్జా'తో హీరోని చేసిన విజయ్‌సేతుపతి ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడని తెలుస్తోంది. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కావడం, అందులోనూ రజనీ హీరోగా చేస్తుండటంలో విజయ్ సేతుపతి రజనీ సినిమాలో విలన్ పాత్రకి ఎగిరి గంతేసి ఒప్పుకున్నాడని సమాచారం. ఇక విజయ్‌సేతుపతి చిరంజీవి నటిస్తున్న 'సై..రా...నరసింహారెడ్డి'లో కూడా విలన్ షేడ్స్ ఉన్న పాత్రనే చేయనున్నాడు. విజయ్ సేతుపతి తాజాగా మాధవన్‌తో చేసిన 'విక్రమ్ వేదా'లో కూడా గ్యాంగ్ స్టర్‌గా నెగటివ్ టచ్ ఉన్న పాత్రనే చేసి తన సత్తా చాటాడు. సో.. కార్తీక్ సుబ్బరాజు చిత్రంలో రజనీని ఢీకొనే పాత్రలో విజయ్‌సేతుపతి ఎంత వరకు మెప్పిస్తాడో వేచిచూడాల్సివుంది...!