సూపర్‌స్టార్ మహేష్ విషయానికి వస్తే తాజాగా ఆయన నటించగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన 'భరత్ అనే నేను' చిత్రం అద్భుతమైన విజయాన్ని సాధిస్తూ నాన్-బాహుబలి, రంగస్థలం కలెక్షన్లను కొల్లగొట్టవచ్చనే వాదన వినిపిస్తోంది. అలా ఆయన చేసిన 'శ్రీమంతుడు' తర్వాత కొంతకాలానికి చిరంజీవి 'ఖైదీనెంబర్ 150'తో నాన్‌బాహుబలి రికార్డులను నెలకొల్పినట్లే మహేష్ కూడా మరోసారి 'భరత్ అనే నేను' ద్వారా శ్రీమంతుడు ఫీట్‌ని సాధించాలనే కసితో ఉన్నాడు.
ఇక ఈ చిత్రంలో నటించిన మహేష్‌బాబుకి రాజకీయలంటే ఆసక్తి లేనట్లేనని స్పష్టం చేశాడు.తన చిత్రం ఎవరికి సపోర్ట్‌గా తీసిన చిత్రం కాదని అంటున్నాడు. కానీ ఈ విషయాన్నితెలుగు దేశం వర్గాలు కొట్టిపడేస్తున్నాయి. ఇంటర్‌నల్‌గా జగన్‌ని హైలైట్ చేసే విధంగా ఈ చిత్రం ఉందని అంటున్నారు. ఇక మరోవైపు ఈ చిత్రాన్నితాజాగా తెలంగాణ ఐటి, పురపాలక మంత్రి కేటీఆర్ స్పెషల్ షోని మహేష్‌తో కలిసి చూసిసినిమాపై పొగడ్త ల వర్షం కురిపించాడు. మరోవైపు 'భరత్ అనే నేను'పై కేటీఆర్ ప్రశంసలు కురిపించిన నేపధ్యంలో మహేష్‌ట్వీట్ చేస్తూ మీ విలువైన సమయాన్ని వెచ్చించి ఈ చిత్రం స్పెషల్‌గా చూసినందుకు, తమ ప్రయత్నాలను మెచ్చుకున్నందుకు కేటీఆర్‌కి మహేష్ ధన్యవాదాలు తెలిపాడు.
ఇక ఇదే సమయంలో తెలుగు సినీ పరిశ్రమకి సంబంధించి 'ప్రత్యేకహోదా'పై మాట్లాడమని కోరితే తనకు అసలు రాజకీయాలలో ప్రవేశంలేదని, తనకి రాజకీయాలు తెలియని మహేష్ చెప్పాడు. అదే మహేష్ తమిళనాట 'జల్లికట్టు' ఉద్యమం సమయంలో మాత్రం ఆయన దానిని సపోర్ట్ చేస్తూ ట్వీట్స్ చేశాడు. కేవలం 'స్పైడర్' చిత్రం తమిళంలో కూడా రిలీజ్ కానున్న నేపధ్యంలోనే ఆయన తమిళులకు జల్లికట్టు విషయంలో మద్దతు తెలిపాడు. ఇక ప్రత్యేకహోదా విషయంలో ఆంద్రప్రదేశ్ ప్రత్యేకహోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమ ప్రత్యేకహోదా విషయంలో స్పందించలేదు. చివరకు తెలంగాణ రాజకీయనాయకులు కూడా ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో మద్దతు ఇస్తూ ఉంటే సినిమా పరిశ్రమ మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆయన విమర్శించాడు. త్వరలోనే ఫిల్మ్ ఇండస్ట్రీకి అల్టిమేటం ఇస్తాం. ప్రత్యేకహోదా ఉద్యమంలో మహేష్‌బాబు పాల్గొనలేదు. అదే సమయంలో తెలంగాణకు చెందిన సంపూర్ణేష్‌బాబు పాల్గొన్నాడు... అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.