Advertisementt

200 కోట్ల క్లబ్బులో రామ్ చరణ్?

Fri 27th Apr 2018 04:00 PM
ram charan,rangasthalam,rangasthalam collections  200 కోట్ల క్లబ్బులో రామ్ చరణ్?
Ram Charan Joins 200 Crore Club 200 కోట్ల క్లబ్బులో రామ్ చరణ్?
Advertisement

మార్చ్ 30  న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్ - సుకుమార్ ల రంగస్థలం సినిమా బాక్సాఫీసుని చెడుగుడు ఆడేసింది. పక్కా పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కిన రంగస్థలం సినిమా పిల్ల పెద్ద అందరిని మెస్మరైజ్ చేసింది. రంగస్థలం బంపర్ హిట్ కలెక్షన్స్ సునామి సృష్టించింది. నాన్ బాహుబలి రికార్డులను కొల్లగొడుతూ... రామ్ చరణ్ మగధీర, చిరంజీవి ఖైదీ నెంబర్ 150  రికార్డులను తిరగరాసింది. రంగస్థలం సినిమా విడుదలైన 15 రోజుల పాటు థియేటర్స్ లో సరైన సినిమా లేకపోవడంతో రంగస్థలానికి ఎదురులేకుండా పోయింది. 

రెండు వారాలకే 150  కోట్ల క్లబ్బుకి చేరిన ఈ సినిమా ప్రస్తుతం 200  కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ విధంగా ఈ సినిమా మ‌రో రికార్డ్ ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం మహేష్ బాబు భరత్ అనే నేను గత శుక్రవారం విడుదలై రంగస్థలం సినిమా కలెక్షన్స్ కి అడ్డుకట్ట వేసింది కానీ..... లేదంటే రంగస్థలం సినిమా ఎప్పుడో రెండొందల కోట్ల క్లబ్బులో చేరేది. మరి రామ్ చరణ్ ఇండస్ట్రీలోకొచ్చాక మగధీర తో ఇండస్ట్రీ రికార్డు ని క్రియేట్ చేస్తే.... అప్పటినుండి మళ్ళీ ఇలా 150  నుండి 200  కోట్ల క్లబ్బుని చేరడానికి రంగస్థలం వంటి హిట్ పడాల్సి వచ్చింది.

మరి సుకుమార్ కూడా తన ఫార్మేట్ మర్చి క్లాస్ నుండి మాస్ కొచ్చి కొత్తగా ప్రయోగం చేసి మరీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. రామ్ చరణ్ ని చిట్టిబాబుగా, సమంత ని రామలక్ష్మిగా, రంగమ్మగా అనసూయని, ప్రెసిడెంట్ గా జగపతి బాబుని, కుమార్ బాబుగా ఆది పినిశెట్టి ని ఎంతో చక్కగా 1980 లో కేరెక్టర్స్ గా చూపించిన సుకుమార్ పల్లెటూరి కథని సినిమాగా మార్చి అందరిని ఆకట్టుకున్నాడు. మరి రంగస్థలం సినిమా ఇలా 200  కోట్ల క్లబ్బుని టచ్ చెయ్యడం మాత్రం స్టార్ హీరోలకు కాస్త కంగారు పుట్టించే విషయమే. మరి ప్రస్తుతం మహేష్ బాబు భరత్ అనే నేను కూడా రంగస్థలం సినిమా కలెక్షన్స్ వెనుకనే పరిగెడుతుంది. చూద్దాం మహేష్ భరత్ ఎంత లాగుతుందో అనేది.

Ram Charan Joins 200 Crore Club:

Ram Charan Rangasthalam Joins 200 Crore Club

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement