తెలుగు న్యూస్ ఛానళ్లని బ్యాన్ చేయాలనీ టాలీవుడ్ హీరోస్ రెడీ అయ్యారు. దాదాపు 18 హీరోస్ తో మొన్న అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ మీటింగ్ కి అటెండ్ అయ్యారు. టాలీవుడ్ లో గత కొంత కాలం నుండి జరుగుతున్న లైంగిక వేధింపులు, కొందరు ప్రముఖులపై ఆరోపణలు, నిరసనలు వంటి తెలుగు చిత్రపరిశ్రమను కుదిపేస్తున్న అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ మీటింగ్ లో పవన్ కళ్యాణ్.. బాలకృష్ణ తప్ప దాదాపు అందరు హీరోస్ అటెండ్ అయ్యారు. చిరంజీవి పిలుపు మేరకు వీరంతా ఆ సమావేశంకి అటెండ్ అయ్యినట్టు తెలుస్తుంది. దాదాపు రెండు గంటలు సేపు డిస్కషన్ జరిగినట్టు సమాచారం. టీవీ ఛానళ్లు కేవలం సినిమాల మీదే బతుకుతున్నాయి అని వారికి సినిమాకు సంబంధించి ఇంటర్వూస్ కానీ.. ట్రైలర్స్ కానీ..ఆడియో ఫంక్షన్స్ కానీ ఇవ్వకూడదని, వాటినసలు ప్రోత్సహించకూడదని, టీవీ చానళ్లను బ్యాన్ చేయాలని ఈ భేటీలో ఒక ప్రతిపాదన వచ్చినట్టు తెలుస్తోంది.
మరో మూడు రోజుల్లో మరొక్కసారి అందరు కూర్చుని ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. అప్పటి వరకు ఈ విషయంపై ఎటువంటి న్యూస్ మీడియాలోకి రాకూడదని తుది నిర్ణయం తీసుకున్నాక, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ద్వారానే ప్రకటించాలని కూడా ఈ సమావేశం నిశ్చయించినట్లు తెలిసింది. హీరోస్ తో పాటు తెలుగు చిత్రసీమకు చెందిన పెద్దలు కేఎల్ నారాయణ, తమ్మారెడ్డి భరద్వాజ, అల్లు అరవింద్, బీవీఎస్‌ఎన్ ప్రసాద్, జీవిత, రాజశేఖర్, మంచు లక్ష్మీప్రసన్న వంటి ప్రముఖులు కూడా ఈ భేటీకి హాజరైనట్లుగా సమాచారం.