కాస్టింగ్‌కౌచ్‌పై బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్ స్పందించింది. శ్రీదేవి, మాధురిదీక్షిత్‌తో పాటు పలువురి స్టార్స్ చేత స్టెప్పులు వేయించి, మూడు సార్లు జాతీయ అవార్డు పొందిన ఈమె తాజాగా కాస్టింగ్‌కౌచ్‌పై స్పందించింది. సినిమా ఫీల్డ్‌లో కాస్టింగ్‌కౌచ్ అనేది బాబా ఆజం కాలం నుంచి ఉంది. కేవలం సినిమా ఇండస్ట్రీలోనే ఇది జరుగుతోందని అనుకోకూడదు. ఇది యావత్ ప్రపంచానికి సంబంధించిన వ్యవహారం. ప్రభుత్వ శాఖలో కూడా ఇది ఉందని అందరకి తెలుసు కదా! ఇక సినిమా ఇండస్ట్రీలో మాత్రం మగాళ్లు ఆడవారిని వాడుకుని ఊరికే వదిలేయరు. అలా వారు కొంతమందికైనా కడుపు నింపుతున్నారు. అవకాశాల కోసం లొంగిపోవాలా? ఎవరి చేతిలో అయినా బంధీలు కావాలా? అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిన అంశమని ఆమె తెలిపారు.
మన దగ్గర టాలెంట్ ఉంటే అలాంటి వాటికి మనం ఎందుకు లొంగాలి? కనిపించిన ప్రతి అమ్మాయి మీద చేయి వేయాలని మగాళ్లందరు భావిస్తూనే ఉంటారు. తిండి పెట్టే ఇండస్ట్రీపై బురద చల్లవద్దని ఆమె కోరారు. ప్రతిదానికి ఇండస్ట్రీని నిందించవద్దు. అది మాకు తండ్రి, తల్లితో సమానం. ఇక గతంలో ఇలియానా మాట్లాడుతూ, కాస్టింగ్‌కౌచ్‌పై ఫిర్యాదులు చేయాలని ఎవరూ భావించరు. దానిపై వ్యాఖ్యలు చేయడానికి కూడా భయపడుతున్నారు అని అన్న విషయంపై సరోజ్‌ఖాన్ స్పందిస్తూ, ఇలియానా చెప్పింది నిజమే. నేను ఒప్పుకుంటాను. ఎవరైనా ఇండస్ట్రీ నుంచి వచ్చి కాస్టింగ్‌కౌచ్‌పై ఆరోపణలు చేస్తే వారికి ఇక ఎవ్వరూ అవకాశాలు ఇవ్వరనేది నిజమేనని ఆమె ఒప్పుకుంది.
మొత్తానికి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కాస్టింగ్‌కౌచ్ విషయంలో మాత్రం ప్రస్తుతం అందరు నోరు విప్పక పరిస్థితి ఏర్పడింది. అయినా టాలీవుడ్‌లో దీనిపై జరిగిన రచ్చ హాలీవుడ్,బాలీవుడ్,కోలీవుడ్‌లలో కూడా జరగలేదని చెప్పాలి.ఇక మగాళ్లు కాస్టింగ్‌కౌచ్ చేసి వదలిలేయరు. వారికి ఏదో మార్గం చూపిస్తారని ఆమె చెబుతుంటే శ్రీరెడ్డి వంటి వారు మాత్రం తమని వాడుకుని కూడా అవకాశాలు ఇవ్వడం లేదని వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కూడా ఈ రెండు కోణాలు ఉన్న విషయాన్ని విస్మరించరాదు.