Advertisementt

చిట్టిబాబు వస్తున్నాడు..!

Fri 27th Apr 2018 01:11 PM
ram charan,chief guest,allu arjun,naa peru surya,pre release event  చిట్టిబాబు వస్తున్నాడు..!
Ram Charan to grace ‘Naa Peru Surya, Naa Illu India' pre-release event చిట్టిబాబు వస్తున్నాడు..!
Advertisement
Ads by CJ

మొత్తానికి శ్రీరెడ్డి, వర్మ, పవన్‌, మీడియా వల్ల మెగా ఫ్యామిలీకి, హీరోలకు బాగానే మంచి జరిగింది. మెగా హీరోలందరూ తమలో విబేధాలు లేవని, కొన్ని విషయాలలో దూరంగా ఉన్నా తామందరం ఒకటేనని నిరూపించుకున్నారు. పవన్‌ ఫిల్మ్‌చాంబర్‌కి వచ్చిన సందర్భంగా బన్నీ అక్కడికి వస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. కానీ బన్నీరావడం, పవన్‌ని ఆప్యాయంగా కౌగిలించుకోవడంతో పాటు తాజాగా మిలటరీ మాధవరంలో జరిగిన 'నా పేరుసూర్య..నా ఇల్లు ఇండియా' ఆడియో వేడుకలో పవన్‌ గురించి బన్నీ ప్రత్యేకంగా మాట్లాడాడు. 

ఇక బన్నీవాసు, అల్లుఅరవింద్‌, నాగబాబు అందరు ఓపెన్‌ అయ్యారు. 'రంగస్థలం' విజయోత్సవ వేడుకలకు చరణ్‌ పిలుపుతో పవన్‌ చీఫ్‌గెస్ట్‌గా వచ్చాడు. ఇప్పుడు రామ్‌చరణ్‌ వంతు వచ్చింది. అల్లుఅర్జున్‌ నటిస్తున్న 'నాపేరు సూర్య...నాఇల్లు ఇండియా' ప్రీరిలీజ్‌ వేడుక ఈనెల 29వ తేదీన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరగనుంది. ఇక 'నాపేరు సూర్య' ఆడియోవేడుకలో బన్నీ రామ్‌చరణ్‌ని తమ్ముడు అని పిలుస్తూ సంబోధించి, 'రంగస్థలం' బ్లాక్‌బస్టర్‌ అయినందుకు శుభాకాంక్షలు తెలిపాడు. 

ఇప్పుడు 'నా పేరు సూర్య' ప్రీరిలీజ్‌ వేడుకలకు సౌండ్‌ఇంజనీర్‌ చిట్టిబాబు, అదేనండీ రామ్‌చరణ్‌ ముఖ్య అతిధిగా రానున్నాడని సమాచారం. మరి ఈ వేడుకలో చరణ్‌.. బన్నీని ఏమని సంబోధిస్తాడో వేచిచూడాల్సివుంది. మరోవైపు 'నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా' చిత్రం మే 4వ తేదీన భారీగా విడుదలకు సిద్దమవుతోంది.

Ram Charan to grace ‘Naa Peru Surya, Naa Illu India' pre-release event:

Ram Charan to be the Chief Guest of Allu Arjun's Naa Peru Surya Pre Release Event

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ