Advertisementt

చరణ్- ఎన్టీఆర్- మహేష్.. ఫ్యాన్స్ తట్టుకోలేరేమో!!

Thu 26th Apr 2018 01:12 PM
mahesh,ntr,charan,one frame,fans  చరణ్- ఎన్టీఆర్- మహేష్.. ఫ్యాన్స్ తట్టుకోలేరేమో!!
Mahesh Babu, NTR, Ram Charan Together చరణ్- ఎన్టీఆర్- మహేష్.. ఫ్యాన్స్ తట్టుకోలేరేమో!!
Advertisement
Ads by CJ

ఈమధ్యన హీరోలంతా ఎంతో కలిసిమెలిసి కనబడుతూ అభిమానును సంతోష పెడుతున్నారు. ఎప్పుడూ మెగా అభిమానులు, నందమూరి అభిమానులు, ఘట్టమనేని అభిమానులు, ప్రభాస్ అభిమానులు ఇలా స్టార్ హీరోల అభిమానులు తమ హీరోల కోసమే ఎదుటి హీరోల అభిమానులతో గొడవలు అవి ఇవి చేస్తుండేవారు. కానీ హీరోలు మాత్రం మేమెంతా ఫ్రెండ్స్ గా ఉన్నాం,... మీరు అలానే ఉండండి అనే వారు. అది వారు వినేవారు కాదు. అయితే గత కొంతకాలంగా యంగ్ అండ్ స్టార్ హీరోల్లో చాలా మార్పులు వచ్చాయి. ఒకళ్ళ సినిమా ఫంక్షన్స్ కి ఒకరు వెళ్లడం... అందరూ కలిసి పార్టీలు చేసుకోవడం, అలాగే విదేశాల్లోనూ కలిసినప్పుడు ఫ్రెండ్లీ గా ఉండడం ఇలా చాలా సందర్భాల్లో బహిరంగంగానే వారు తమ మధ్యన ఉన్న స్నేహాన్ని చాటుతున్నారు.

తాజాగా మహేష్, ఎన్టీఆర్ లు భరత్ ఈవెంట్ లో కలిసి సందడి చేశారు. అక్కడికి చరణ్ కూడా రావాల్సి ఉండగా... కొన్ని కారణాలతో అతను అక్కడికి రాకపోయినా.. ఆ నైట్ దానయ్య ఇచ్చిన పార్టీలో ఎంజాయ్ చేస్తూ చరణ్, మహేష్, ఎన్టీఆర్ లు కలిసి ఫొటోస్ కూడా దిగారు. ముగ్గురు ఒకే ఫ్రెమ్ లో కనబడే సరికి అభిమానుల ఆనాడు అవధుల్లేకుండా పోయాయి. అందులో ఎన్టీఆర్ - రామ్ చరణ్ లు కలిసి రాజమౌళి మల్టీస్టారర్ లో నటించడం కూడా శుభపరిణామమే. ప్రస్తుతం రామ్ చరణ్ రంగస్థలం హిట్ తోనూ, మహేష్ బాబు భరత్ అనే నేను హిట్ తో ఎంజాయ్ చేస్తున్నారు. రామ్ చరణ్, మహేష్  లు మాములుగా ఎప్పటినుండో స్నేహితులే. ఎన్టీఆర్, చరణ్ లు అంతే, కానీ ఇప్పుడు మహేష్ - చరణ్ - ఎన్టీఆర్ లు కలిసి ఎక్కడబడితే అక్కడ కనబడుతున్నారు.

తాజాగా వారు ముగ్గురు మళ్ళీ కలిశారు. ఎక్కడ కలిసారో క్లారిటీలేదు కానీ... మహేష్ కి చరణ్ కి మధ్యలో ఎన్టీఆర్ నిలబడడం ఒక ఎత్తు అయితే... చరణ్ ఎన్టీఆర్ ని గట్టిగా పట్టుకోవడం, మహేష్ కూడా ఎన్టీఆర్ ని ప్రేమ గా పట్టుకోవడం.. అసలు ఆ ఫోటో చూస్తుంటే ముగ్గురు స్టార్ హీరోల  అభిమానులు ఎక్కడా ఆగరేమో అనిపిస్తుంది. అయితే గత రాత్రి ఈ ఫోటోని చరణ్ వైఫ్ ఉపాసన, మహేష్ వైఫ్ నమ్రతలు సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. మరి వారు సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటారో వేరే చెప్పాలా. కానీ వాళ్ళు పోస్ట్ చేసిన ఆ ఫోటో మాత్రం సాంఘీక మాధ్యమాల్లో విపరీతంగా ట్రేండింగ్ లో కొచ్చేసింది. మరి మీరు ఆ పిక్ ని ఓ లుక్కెయ్యండి.

Mahesh Babu, NTR, Ram Charan Together:

Mahesh, NTR, Charan In One Frame

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ