నిజానికి తెలుగుకి సీక్వెల్స్ బాగా కలిసి రావట్లేదు. ఏదో 'బాహుబలి' తప్ప మిగిలిన ఆ తరహా చిత్రాలన్నీ దెబ్బతిన్నాయి.'ఆర్య2, సర్దార్‌గబ్బర్‌సింగ్' తరహాలో అలా వచ్చిన చిత్రాలు సరిగా ఆడలేదు. ఇక ఇటీవల 'రాజుగారి గది 2' కూడా నిరాశ పరిచింది. ఇక ఇప్పుడు 40ఏళ్ల వయసులో అర్జున్‌రెడ్డి ఎలా ఉంటాడు? అనే పాయింట్ మీద సీక్వెల్ రానుందని ప్రచారం సాగుతోంది. కానీ తెలుగులో ఎక్కువ చిత్రాలను ఆయా పాత్రలనే తీసుకుని కొత్త కథతో ఎంటర్‌టైన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక 'భరత్ అనే నేను' విషయంలోకూడా కొరటాల శివ తనకి ఐదు గంటల స్టోరీ చెప్పాడని, కానీ నిడివి సమస్య వల్ల అందులోని చాలా సీన్స్‌ని తీయలేదని, అదే ఈ చిత్రం రెండు పార్ట్‌లుగా వస్తే బాగుండేదని చెప్పాడు. సామాన్యంగా సీక్వెల్స్, రీమేక్స్‌కి వ్యతిరేకి అయిన మహేష్ అలా మాట్లాడటంతో బహుశా ఈచిత్రానికి సీక్వెల్ ఉంటుందేమో అని అందరు ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని ఎలా నడిపాడు? సమాజానికి ఏమి చేశాడు? అనే యాంగిల్‌లో ఈకథ ఉండవచ్చుని కొరటాల అంటూనే కేవలం సీక్వెల్స్ చేయడమే పనికాదని, చెప్పాలంటే ఎన్నో కథలు మన వద్ద ఉన్నాయని తెలిపాడు.
ఇక ఇటీవల వచ్చిన 'రంగస్థలం'లో చిట్టిబాబు పాత్ర రామ్‌చరణ్‌ని తప్ప మరెవ్వరిని ఊహించలేమని అందరు చెప్పుకున్నారు. ఇప్పుడు 'భరత్ అనేనేను' చిత్రం విషయంలో కూడా ఈ పాత్రను మహేష్ తప్పితే ఎవరూ చేయలేరని, మహేష్ ఒప్పుకోకుండా ఈ కథనే పక్కనపెట్టేసే వాడినని కొరటాల శివ తెలిపాడు. ఈ పాత్రలో ఎవ్వరిని ఊహించుకోలేం. మహేష్ మాత్రమే దానికి న్యాయం చేయగలడని భావించానని కొరటాల చెప్పుకొచ్చాడు. ఎక్కువ మాట్లాడకుండా ప్రభావం చూపించేలా నటించే నటుడు ఈ పాత్ర చేయాలని భావించాను. ఆ నటుడు వాయిస్ పెంచకుండా మాట్లాడాలి. అయినప్పటికీ జనాలు ఆయన మాటలు వినాలి. అనవసరమైన దూకుడు చూపించకుండా ఇంటెన్సిటీ కనిపించేలా చేయాలి. ఈ లక్షణాలన్నిఉన్న స్టార్ గా నాకు మహేష్‌బాబు మాత్రమే కనిపించాడు.
ఆయన తక్కువ మాట్లాడుతాడు. కానీఎంతో పవర్‌ఫుల్‌గా మాట్లాడుతాడు. అయినా ప్రభావం చూపిస్తాడని అందుకే ఈ పాత్ర మహేష్‌కి రెడీ మేడ్ వంటి పాత్ర అని చెప్పుకొచ్చాడు.ఇక ఈచిత్రం తమిళనాట కూడా అద్భుత కలెక్షన్లు సాధిస్తోంది. కర్ణాటకలో కూడా అంతే.ఇక ఈచిత్రాన్ని త్వరలో బాలీవుడ్‌లోకి అనువాదం చేయనున్నారు. యూనివర్శల్ సబ్జెక్ట్ కాబట్టి ఈ సినిమా ఏ భాషలోకి వెళ్లినా ఆదరణ లభించడం ఖాయమనే చెప్పాలి.