నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి సావిత్రి బయోపిక్ 'మహానటి' సినిమా వచ్చేనెల 9 నే విడుదల కాబోతుంది. ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులతో పాటు.. తమిళనాడు ప్రేక్షకులు మహా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో మహానటి సావిత్రి పాత్రను కీర్తి సురేష్ పోషిస్తే.. మిగతా కేరెక్టర్స్ కోసం కూడా స్టార్ నటులే నటించారు. సమంత, నాగ చైతన్య, షాలిని పాండే, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు వంటి నటీనటులు ఈ సినిమాలో భాగమైనప్పటికీ అందరి చూపు కీర్తి సురేష్ అంటే సావిత్రి పాత్రధారి మీదే ఉంటుంది. అయితే ఈ సినిమా చెయ్యడానికి నాగ్ అశ్విన్ చాలా రీసెర్చ్ చేసాడు. సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరిని కలిసి సావిత్రి గారి గురుంచిన విషయాలు తెలుసు కోవడమే కాదు. ఇంకా సావిత్రితో పాత పరిచయాలున్న చాలామందిని కలిసి నాగ్ అశ్విన్ 'మహానటి' కోసం సమాచారం సేకరించాడు.
అయితే కొంతమంది సినిమాలు చేస్తున్నప్పుడు కొంతమంది రైటర్ దగ్గరనుండి అయినా ... లేదంటే ఏదన్నా నవల నుండి అయిన కథ తీసుకుంటే.. అందుకోసం కథ హక్కుల కింద కొంత డబ్బు వారికీ ఇస్తుంటారు. మరి ప్రస్తుతం సావిత్రి మీద రాసిన పుస్తకాల హక్కులకు ఎంతో కొంత లాయల్టీ ఆమె కూతురు చాముండేశ్వరి కి ఇస్తూనే ఉంటారు. అయితే సావిత్రి బయోపిక్ గా సినిమా తీస్తే మరి ఆమెకి ఎంతో కొంత డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మహానటి నిర్మాత స్వప్న దత్ సావిత్రి బయోపిక్ చేస్తునందుకు గాను విజయ చాముండేశ్వరి డబ్బేమీ ఇచ్చినట్టు లేదనే టాక్ వినబడుతుంది. మరి సినిమాపై ఉన్న అంచనాలో మంచి లాభాలు వస్తే ఏమన్నా సావిత్రి గారి కూతురుకి డబ్బిస్తారేమో స్వప్న దత్ వాళ్ళు చూడాలి.
మహానటి సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే మహానటి సినిమా ఎంతో ఘనంగా తెరకెక్కినా... జమున వంటి వాళ్ళు మాకు కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా సావిత్రి బయోపిక్ ని ఎలా తీస్తారంటూ కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఒక కీ రోల్ చేస్తున్న విజయ్ దేవరకొండ తాజాగా మహానటి సావిత్రి గారి గురించి మాట్లాడుతూ.. సావిత్రి మనసు చాలా సున్నితం .. అసలు సావిత్రి గారు ఎవరికీ భయపడేవారు కాదు. కష్టాల్లో వున్నవారికి తనవంతు సాయం చేశారు. ఆమె ప్రేమించాలనుకున్నారు .. ప్రేమను పొందాలనుకున్నారు .. ఆ తరువాతే సూపర్ స్టార్ కావాలనుకున్నారు. కానీ ఆమెను చాలామంది చాలా రకాలుగా విమర్శించారు. అలా ఆమెను తిట్టిన వాళ్లంతా నా దగ్గరికి వస్తే .. మహానటి సినిమా ఆడియో లాంచ్ పాస్ లు ఇస్తాను. తనని విమర్శించిన వాళ్లు ఈ వేడుకకి వస్తే సావిత్రి ఆత్మ సంతోషిస్తుంది అంటూ సెటైరికల్ గా మట్లాడాడు.