త్రివిక్రమ్ కి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుందా.. అంటే అవుననే అంటున్నారు. ఒకప్పుడు త్రివిక్రమ్ తో సినిమాలు చెయ్యాలని ఎగబడిన స్టార్ హీరోలు ఇప్పుడు త్రివిక్రమ్ కి మొహం చాటేస్తున్నారనే ప్రచారం వీర లెవల్లో నడుస్తుంది. పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించిన అజ్ఞాతవాసి సినిమాతో త్రివిక్రమ్ కి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. అది ఛల్ మోహన్ రంగ స్టోరీతో స్ట్రాంగ్ అయ్యింది. అయితే ఎటువంటి భయాలు పెట్టుకోకుండా ఎన్టీఆర్, త్రివిక్రమ్ తో సినిమాకి రెడీ అవడం.. సెట్స్ మీద కెళ్ళడం చక చక జరిగిపోయాయి. అయితే ఎన్టీఆర్ తో ఒకే గాని త్రివిక్రమ్ కి ఇప్పుడు ఒక స్టార్ హీరో హ్యాండిచ్చాడు.
ఇంతకీ ఆ హీరో ఎవరో ఈపాటికే అర్ధమై ఉంటుంది కదా... అతనే భరత్ అనే నేను తో హిట్ కొట్టిన మహేష్ బాబు. మహేష్ ప్రస్తుతం కొరటాలతో కలసి భరత్ తో భారీ హిట్ అందుకున్నాడు. తర్వాత వంశి పైడిపల్లితో మరో సినిమా చేస్తున్నాడు. ఇక వంశి సినిమా ముగిసిన వెంటనే రంగస్థలంతో హిట్ కొట్టిన సుకుమార్ తో తన 26 వ సినిమాని ఫిక్స్ చేసున్నాడు. ఇక సుకుమార్ తర్వాత అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా లైన్ లోకొచ్చేశాడు. అర్జున్ రెడ్డి హిట్ తర్వాత సందీప్ వంగతో కలిసి సినిమా చేసే యోచనలో మహేష్ ఉన్నాడు.
కానీ ఈలోపు రంగస్థలం సినిమా రావడంతో మహేష్ దృష్టిలో సుకుమార్ పడ్డాడు. రంగస్థలంతో రణరంగమైన హిట్ కొట్టిన సుకుమార్ తో మహేష్ మూవీ చెయ్యడానికి సిద్దమవడంతో.. సుకుమార్ తర్వాత లైన్ లోకి సందీప్ వంగా వచ్చేశాడు. కానీ త్రివిక్రమ్ తో మహేష్ బాబు ఒక సినిమా ఫైనలైజ్ కూడా అయ్యింది. కానీ త్రివిక్రమ్ అజ్ఞాతవాసితో కోలుకోలేని ప్లాప్ కొట్టడంతో ఎందుకులే రిస్క్ అనుకున్న మహేష్ ఇలా తన సినిమాల కోసం వరుసగా దర్శకులను సెట్ చేసుకున్నాడు. అతడు, ఖలేజా సినిమాలతో త్రివిక్రమ్ - మహేష్ మధ్యన అనుబంధం ఏర్పడినా... ప్లాప్ లో ఉన్న దర్శకుడికి ఛాన్స్ ఇచ్చేంత అనుబంధం లేదులే అని అంటున్నాడట మహేష్ తన సన్నిహితుల వద్ద.